గిన్నెలు కడుగుతోన్న కుక్క.. ఫొటో వైరల్..

సాధారణంగా ఏదైనా తెలివైన పనులు నేర్చుకునే విషయంలో పెంపుడు జంతువులు ముందు వరుసలో ఉంటాయి. ఇప్పటికే పలు జంతువులు పలు విచిత్రాలు చేసిన విషయాలు మనం చాలా వీడియోల్లో చూశాము. కానీ ఓ కుక్క మాత్రం ఇంకా విచిత్రమైన పని...

గిన్నెలు కడుగుతోన్న కుక్క.. ఫొటో వైరల్..
Follow us

| Edited By:

Updated on: Jun 14, 2020 | 4:35 PM

సాధారణంగా ఏదైనా తెలివైన పనులు నేర్చుకునే విషయంలో పెంపుడు జంతువులు ముందు వరుసలో ఉంటాయి. ఇప్పటికే పలు జంతువులు పలు విచిత్రాలు చేసిన విషయాలు మనం చాలా వీడియోల్లో చూశాము. కానీ ఓ కుక్క మాత్రం ఇంకా విచిత్రమైన పని చేసింది. అదేంటంటే.. గిన్నెలు కడగటం. ఏంటి షాక్ అవుతున్నారా.. అవును గిన్నెలు కడుగుతూ ఉన్న ఓ శనకం ఫొటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ఓ కుక్క కిచెన్‌లో కుర్చీపై కూర్చొని గిన్నెలు తోముతూ ఉంది. ఈ ఫొటోను ముకుల్ సింగ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘ఎప్పుడూ ఇది ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఇక నుంచి ఇంట్లోని పనుల్లో సాయం చేస్తేనే దానికి ఫుడ్’… అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. అయితే దీనిపై కొందరు నెటిజన్లు జోకులు వేస్తుంటే.. మరికొందరు మాత్రం మూగజీవాలను వేధిస్తున్న యజమానిపై చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ ఫొటో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Read More: 

బ్రేకింగ్: కరోనాతో ఎమ్మెల్యే గన్‌మెన్‌ మృతి

భారీగా కరోనా మరణాలు.. శవాలతో నిండిపోయిన అతిపెద్ద శ్మశాన వాటిక

దారుణం.. ఇంటర్ ఫెయిల్‌తో.. ముగ్గురు విద్యార్థినుల ఆత్మహత్య!

తెలంగాణ సచివాలయంలో మరో కరోనా కేసు.. ఉలిక్కిపడుతోన్న ఉద్యోగులు