చైనాను వణికించిన రాక్షసుడు

A 'creature' slithering in Yangtze River sparked many theories., చైనాను వణికించిన రాక్షసుడు

చైనా దేశీయుల్ని ఓ రాక్షసుడు భయబ్రాంతులకు గురిచేశాడు. యాంగ్జీనదిలో నీటిపై తేలియాడుతూ ధ్యానం చేస్తున్న వీడియో ఒకటి అక్కడి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు ఆరు మిలియన్లకు పైగా వ్యూయర్స్‌ని ఆ పుటేజ్‌ ఆకర్షించింది. ఆ వీడియో చూసిన చైనా నెటిజన్లు సైతం ఆ రాక్షసుడికి రకరకాల పేర్లు పెడుతూ ట్విట్లు చేశారు. ఇంతకీ ఎవరా రాక్షసుడు..ఏం చేశాడో తెలుసా ?
అది చైనా దేశంలోని హుబీ ప్రావిన్స్‌లో గల యాంగ్జీ నది. త్రీ గోర్జెస్‌ బ్రిడ్జ్‌ సమీపంలో అలలపై తేలుతూ..ఓ వింత ఆకారం అక్కడి నావీ సిబ్బంది కంటపడింది. దాదాపు 65 అడుగుల పొడవు, నల్లటి ఆకారంతో ప్రవాహానికి ఎదురీదుతున్నట్లుగా కనిపించింది. అదేంటో అర్థంకాకపోవడంతో ఎవరికీ తోచిన పేరుతో వారు చెప్పుకుంటూ ప్రచారం మొదలు పెట్టారు. నదీ జలాలు పూర్తిగా కలుషితం కావటంతో నీటిలో ఏదో వింత జీవి తయారైందని చాలా మంది భయపడిపోయారు. నీటిపై ధ్యానం చేస్తున్నట్లుగా ఉండటంతో అది పూర్వకాలం నాటి రాక్షసుడని కొందరు, త్రీ గోర్జెస్‌ వంతెన సమీపంలో కనిపించింది కాబట్టి త్రీ గోర్జెస్‌ వాటర్‌ మాన్స్టర్‌ అని, నీటిలో జీవించే పొడవైన విషసర్పం అని మరికొందరు రకరకాల పేర్లు పెట్టారు. ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేయడంతో..నేవీగేషన్‌ అధికారులు రంగంలోకి దిగారు..ఆ వింత ఆకారం ఎంటనే దానిపై ప్రత్యేక
బృందాలను ఏర్పాటు చేసి బయటకు తీయించే ప్రయత్నం చేశారు..ఎట్టకేలకు ఆ జీవిని ఒడ్డుకు చేర్చారు సిబ్బంది. తీరా దానిని చూసిన కార్మికులు, నేవీ అధికారులు విస్తుపోయారు. నదీలో కనిపించిన వింత ఆకారం జీవి కాదు..ఓ పొడవైన నల్లని గొట్టం అని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. గొట్టాలను వెలికి తీసిన కార్మికులు వాటిని దూరంగా తీసుకెళ్లి ధ్వంసం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *