చేపా.. చేపా.. నీకు రెండు నోళ్లా..వావ్

Viral: Fish with two mouths shocks the internet, చేపా.. చేపా.. నీకు రెండు నోళ్లా..వావ్

చేపకు రెండు నోర్లు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో. నిజమే.. చేపకేంటి రెండు నోర్లు ఉండటమేంటనుకుంటున్నారా.. నిజంగానే ఓ చేపకు రెండు నోర్లు ఉన్నాయి. సాధారణంగా జన్యులోపాలతో రెండు తలల పాము, రెండు తలలు ఉన్న జంతువులను మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కానీ రెండు నోర్లు ఉన్న చేపను గతంలో ఎక్కడ చూసిన దాఖలాలు లేవు. నార్త్ అమెరికాలోని చాంప్లెయిన్ సరస్సులో చేపల వేటకు వెళ్లిన ఓ మహిళకు అరుదైన చేప లభించింది. అన్ని చేపలకు ఒక నోరు ఉంటే.. ఓ చేపకు రెండు నోర్లు ఉన్నాయి. దీంతో అదిచూసి ఆ మహిళ ఆమె భర్త ఆశ్చర్యపోయారు. అయితే ఆ అరుదైన చేప ఫోటోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది నిమిషాల్లో 6 వేలకు పైగా షేర్లను, వేల సంఖ్యలో కామెంట్లనూ తెచ్చుకుంది. అయితే తిరిగి ఆ అరుదైన చేపను సరస్సులోనే వదిలేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *