Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్షల 36 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 236657. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 115942. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 114073. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6642. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి.. సచివాలయంలో కరోనా కలకలం ఈ రోజు మరో ఐదు పాజిటివ్ కేసులు నమోదు మొత్తం 9 కి చేరిన పాజిటివ్ కేసులు అసెంబ్లీలో ఒక పాజిటివ్ కేసు నమోదు.
  • అమర్‌నాథ్ యాత్రకు పచ్చజెండా. జులై 21 నుంచి ఆగస్టు 3 వరకు యాత్ర. 15 రోజులు మాత్రమే యాత్రా సమయం. 55ఏళ్లు పైబడినవారికి యాత్రకు అనుమతి లేదు. కోవిడ్-19 జాగ్రత్తలతో యాత్రకు ఏర్పాట్లు. కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికెట్లు ఉన్నవారికి మాత్రమే అనుమతి. బాల్తాల్ మార్గంలో మాత్రమే యాత్రకు అనుమతి. పహల్‌గాం వైపు నుంచి ఉన్న యాత్రామార్గం మూసివేత.
  • తెలంగాణ లో జిమ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంతోష్. తెలంగాణ లో జిమ్ ల నిర్వహణకు అనుమతివ్వండి. కోవిడ్ నిబంధనలకు లోబడి జిమ్ లను నిర్వహిస్తాం. ప్రభుత్వానికి తెలంగాణ జిమ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ . జిమ్ లను నమ్ముకుని ఎన్నో కుటుంబాలు ఆదారపడి ఉన్నాయి. జిమ్ ల తెరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలివ్వాలి. తెలంగాణ వ్యాప్తంగా 5 వేల జిమ్ ల్లో 50 వేల మంది ఆధారపడిన ఇండస్ట్రీ.
  • కర్నూలు: భూమా అఖిలప్రియ ఏ వి సుబ్బారెడ్డి మధ్య విభేదాలు వారి వ్యక్తిగతం. తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు... టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు.
  • విశాఖ: దివ్య కేసులో కొనసాగుతున్న పోలీస్ దర్యాప్తు. రావులపాలెం నుంచి దివ్య పిన్ని కృష్ణవేణిని పిలిపించిన పోళిసులు. దివ్య కేసులో మరికొంతమంది పాత్రపై ఆరా తీస్తున్న పోలీసులు. ఇప్పటికే వసంతతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. దివ్య ఘటనపై విచారణ జరుపుతున్నాం. తొలుత అనుమానాస్పద మృతికేసు నమోదు చేశాం.. పలుకోణాల్లో విచారిస్తున్నాం: డీసీపీ రంగారెడ్డి.

లండన్‌‌లో రెచ్చిపోయిన హాంకాంగ్ నిరసనకారులు.. మహిళా మంత్రిపై దాడి

Teresa Cheng targeted by dozens of protesters in Holborn shouting murderer, లండన్‌‌లో రెచ్చిపోయిన హాంకాంగ్ నిరసనకారులు.. మహిళా మంత్రిపై దాడి

హాంకాంగ్ నిరసనకారులు లండన్లో రెచ్చిపోయారు. హాంకాంగ్ న్యాయ శాఖ మంత్రి తెరెసా చెంగ్‌ని తరిమితరిమి కొట్టి ఆమెపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె కింద పడిపోగా చేతికి తీవ్ర గాయమైంది. ఛార్టర్డ్ ఇన్స్‌టిట్యూట్ కార్యాలయం వద్ద తన కారు దిగుతున్న ఆమెను చూసిన ఆందోళనకారులు దూసుకువచ్చి ఎటాక్ చేశారు. మూకుమ్మడిగా ఆమెను చుట్టుముట్టి నెట్టివేయడంతో ఆమె కింద పడిపోయారు. పోలీసులు వచ్ఛే లోగా వారు పారిపోయారు. తెరెసాను పోలీసులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. హాంకాంగ్‌లో కొన్నివివాదాలను పరిష్కరించడంలో సఫలీకృతురాలైన ఆమె దానికి సంబంధించి ప్రసంగించేందుకు లండన్ వచ్చారు. హాంకాంగ్ పై చైనా ఆధిపత్యాన్ని నిరసిస్తూ గత ఎనిమిది నెలలుగా ఆందోళనలు జరుగుతున్నాయి. పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన, జరుగుతున్న ఘర్షణల్లో పలువురు మరణించగా… సుమారు వెయ్యిమందికి పైగా గాయపడ్డారు.మొదట నేరస్థుల అప్పగింత బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి భారీ ప్రదర్శనలకు పూనుకోవడం ఉద్యమానికే దారి తీసింది. ఈ బిల్లుపై ప్రభుత్వం వెనక్కు తగ్గినప్పటికీ.. దీన్ని పూర్తిగా ఉపసంహరించాలంటూ వారు పార్లమెంట్ ముట్టడికి సైతం సిధ్దపడ్డారు. చివరకు లండన్‌లోనూ నిరసనకారులు రెచ్చిపోయి.. ఒక మహిళా మంత్రిపై దాడి చేయడం ఇదే మొదటిసారి.

 

Teresa Cheng targeted by dozens of protesters in Holborn shouting murderer, లండన్‌‌లో రెచ్చిపోయిన హాంకాంగ్ నిరసనకారులు.. మహిళా మంత్రిపై దాడి

Related Tags