కేసీఆర్ నన్ను చంపమన్నాడా.?

టీఎస్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో ఇవాళ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్‌కు విపక్షాలన్నీ మద్దతు తెలిపాయి. ఇక ప్రశాంతంగా మొదలైన ఈ బంద్ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ ఎమ్‌ఎల్ నేత పోటు రంగారావు చేతి బొటను వేలు తెగింది. పోలీసులు వ్యాన్‌లోకి ఎక్కించి డోర్ వేస్తున్న క్రమంలో వేలు తెగగా.. దీనికి పోలీసుల అత్యుత్యాహమే కారణమని రంగారావు ఆరోపించారు. […]

కేసీఆర్ నన్ను చంపమన్నాడా.?
Follow us

|

Updated on: Oct 19, 2019 | 2:30 PM

టీఎస్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో ఇవాళ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్‌కు విపక్షాలన్నీ మద్దతు తెలిపాయి. ఇక ప్రశాంతంగా మొదలైన ఈ బంద్ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ ఎమ్‌ఎల్ నేత పోటు రంగారావు చేతి బొటను వేలు తెగింది. పోలీసులు వ్యాన్‌లోకి ఎక్కించి డోర్ వేస్తున్న క్రమంలో వేలు తెగగా.. దీనికి పోలీసుల అత్యుత్యాహమే కారణమని రంగారావు ఆరోపించారు. ఒకవైపు రక్తమోడుతున్నా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన నినాదాలు చేస్తూనే ఉన్నారు. పోలీసుల తీరుపై మండిపడ్డ ఆయన.. తనను కేసీఆర్ చంపమన్నాడా అంటూ తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.

నాటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు.. ఇప్పుడు కార్మికుల పక్షాన నిలబడి పోరాడినందుకు ఇది తనకు లభించిన బహుమానమా అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గాయపడ్డ రంగారావును దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు.