మహీంద్రా, లెజెండ్స్‌ ఆధ్వర్యంలో “యెజ్డీ’ రీఎంట్రీ

Yezdi motorcycles to make India entry soon, మహీంద్రా, లెజెండ్స్‌ ఆధ్వర్యంలో “యెజ్డీ’ రీఎంట్రీ
మోటారు వాహనప్రియులకు మరో శుభవార్త…అందమైన బైక్‌పై ఆగకుండా రైడ్‌ చేసేందుకు మరో కొత్త బైక్‌ మార్కెట్లోకి రానుంది. దానికి సంబంధించి సోషల్‌ మీడియాలో ఫోటోలు, వార్తలు తెగచక్కర్లు కొడుతున్నాయి. 1996 ముందు వరకు జనాలన్నిఓ ఊపు ఊపేసిన ఆ మోటార్‌ సైకిల్‌ ఇప్పుడు న్యూలుక్కుతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. 2020 ఆటో ఎక్స్‌ పో నాటికి ఈ బైక్స్‌ని వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని కంపెనీ ప్లాన్‌ చేస్తోందట. మహీంద్రా అండ్‌ మహీంద్రా సొంతంగా ఏర్పాటు చేసిన బ్రాండ్‌ క్లాసిక్‌ లెజెండ్స్‌ ఆధ్వర్యంలో తిరిగి “యెజ్డి’ మోటార్‌ సైకిల్స్‌ భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఇండియన్‌ రోడ్లపై జావా బైక్స్‌ చాలా ప్రజాదరణ పొందాయి. జావా మోటార్‌ సైకిల్‌ ఇంజిన్‌ మాదిరే మహీంద్రా మోజో పవర్స్‌ యెజ్డీ బైక్‌ ఇంజిన్‌ సామర్థ్యం కలిగి ఉంటుందని సంస్థ వెల్లడించింది. అయితే, లాంచింగ్‌పై ఖచ్చితమైన డేట్‌ ఫిక్స్‌ ప్రకటించనప్పటికీ ..భారత్‌ బైక్‌ మార్కెట్‌ను ఏలిన యెజ్డీ మోటార్‌ సైకిల్స్‌ బైక్ అధికారిక పేజీ యాక్టివ్‌ గా ఉంది. క్లాసిక్‌ లెజెండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్‌ సంయుక్తంగా తీసుకొస్తున్న ఈ బండిపై అప్పుడే అంచనాలు మించిపోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *