కామారెడ్డి జిల్లాలో దారుణం..క‌రోనా నెపంతో తల్లీకొడుకును బంధించిన గ్రామ‌స్థులు

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లిలో అమానుష ఘ‌ట‌న‌‌ చోటుచేసుకుంది. కరోనా భయంతో తల్లి కొడుకును ఊర్లోకి రాకుండా అడ్డుకున్నారు గ్రామ‌స్థులు. గ్రామ శివారులో గ‌ల పాఠ‌శాల‌లోని ఓ గదిలో ఉండాలని హుకుం జారీ చేశారు.

కామారెడ్డి జిల్లాలో దారుణం..క‌రోనా నెపంతో తల్లీకొడుకును బంధించిన గ్రామ‌స్థులు
Follow us

|

Updated on: Jul 04, 2020 | 1:23 PM

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లిలో అమానుష ఘ‌ట‌న‌‌ చోటుచేసుకుంది. కరోనా భయంతో తల్లి కొడుకును ఊర్లోకి రాకుండా అడ్డుకున్నారు గ్రామ‌స్థులు. గ్రామ శివారులో గ‌ల పాఠ‌శాల‌లోని ఓ గదిలో ఉండాలని హుకుం జారీ చేశారు. స్కూల్ నుంచి బయటకు రాకుండా చుట్టూ ముళ్ల కంచె వేశారు.

వివ‌ర్లాలోకి వెళ్తే జంగంపల్లిలో సుధారాణి అనే మ‌హిళ కుటుంబం నివ‌శిస్తోంది. ఆమె కూతురుకి ఇటీవ‌లే ప్ర‌స‌వం అయ్యింది. ఆమెను చూడటానికి బాలింత‌ త‌ల్లి సుధారాణి, సోద‌రుడు రాకేశ్ ఆస్ప‌త్రికి వెళ్లారు. అయితే ఆ త‌ర్వాత చేసిన టెస్టులో శిశువుకు క‌రోనా ఉన్న‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. దీంతో తల్లీకొడుకు.. సుధారాణి, రాకేష్ ల‌ను ఊర్లోకి రాకుండా అడ్డుకుని అమానుషంగా వ్య‌వ‌హ‌రించారు. తీవ్ర మనోవేదనకు గురై సెల్ఫీ వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు బాధితులు. కరోనా కంటే గ్రామస్తుల మానసిక వేధింపులతోనే తాము చ‌నిపోయేలా ఉన్నామ‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.