గాంధీ జయంతి సాక్షిగా గ్రామస్తుల దీక్ష..

ఆ గ్రామం ఏ మారుమూలనో, మండలానికి దూరంగానో లేదు. మున్సిపల్‌ కేంద్రానికి కూతవేటు దూరంలోనే ఉన్న గిరి కొత్తపల్లి గ్రామం..

గాంధీ జయంతి సాక్షిగా గ్రామస్తుల దీక్ష..
Follow us

|

Updated on: Oct 03, 2020 | 4:44 PM

ఆ గ్రామం ఏ మారుమూలనో, మండలానికి దూరంగానో లేదు. మున్సిపల్‌ కేంద్రానికి కూతవేటు దూరంలోనే ఉన్న ఆ గ్రామానికి నేటికీ బీటీ రోడ్డు లేదు. ఉన్న మట్టిరోడ్డు గుంతల మయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  మూడేళ్ల క్రితం ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రారంభించినా…నిర్మాణానికి నోచుకోని గిరి కొత్తపల్లి రోడ్డు, కాంగ్రెస్ టిఆర్ఎస్ ఎమ్మెల్యేల చేతుల మీదుగా రెండు పర్యాయాలు బిటి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. యేండ్ల కాలంగా పూర్తికానీ రోడ్డుతో విసిగిపోయిన ఆ గ్రామస్థులు గాంధీ జయంతిని పురస్కరించుకుని రిలేనిరహార దీక్షలు చేపట్టారు.

రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం గిరి కొత్తపల్లి లో గాంధీజీ జయంతి సాక్షిగా బిటి రోడ్డు కోసం గ్రామస్థులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పది మందితో మొదలైన ఉద్యమం రోడ్డు సాధన కోసం ఆమరణ నిరాహార దీక్షకు వెనకాడబోమని, రోడ్డు నిర్మాణ విషయంలో నేతలు కాంట్రాక్టర్ల మాటలు నమ్మశక్యంగా లేవని ఆరోపించారు. ఎంపీ ఎమ్మెల్యేలు హామీ ఇచ్చే వరకు దీక్షలు విరమించేది లేదని తేల్చి చెప్పారు. గిరి కొత్తపల్లి ఇర్విన్ గ్రామాల మధ్య రెండేళ్ల క్రితం మంజూరైన బిటి రోడ్డు వెంటనే చేపట్టాలని అహింస శాంతియుత ఉద్యమాలకు మారుపేరైన జాతిపిత మహాత్మా గాంధీ సాక్షిగా ఆయన 151 జయంతి రోజున గ్రామస్తులంతా మూకుమ్మడిగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.  రెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి, సంవత్సరం క్రితం అధికార పార్టీకి చెందిన జైపాల్ యాదవ్ భూమి పూజ చేసి ప్రారంభించారు. అయినప్పటికీ బిటి రోడ్డు నిర్మాణ పనులు మాత్రం కేవలం కల్వర్టుల తోనే సరిపెట్టి కాలయాపన చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిత్యం వివిధ సమస్యలపై మండల కేంద్రం తోపాటు ఆమనగల్లు మండలానికి రాకపోకలు సాగేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. మాడుగుల మండలం ఇర్విన్ నుండి గిరి కొత్తపల్లి గ్రామ మధ్య సుమారు మూడున్నర కిలోమీటర్ల రోడ్డు మంజూరై రెండు ఏళ్ళు గడుస్తున్నా నేటికీ రోడ్డు నిర్మాణం పూర్తికాకపోవడంతో గ్రామ పెద్దలు నిరాహారదీక్ష చేపట్టారు. మా గ్రామానికి ఎన్నో ఏండ్లుగా బీటీ రోడ్డు లేకపోవ డంతో ఇబ్బందులు పడు తున్నాం. మట్టిరోడ్డు కావడంతో పూర్తిగా గుంతల మయంగా మారింది. వర్షాలు పడితే రోడ్డు గుండా నడవలేని పరిస్థితి.ఇప్పటికైన అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తమ ఊరికి బిటి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..