గ్రామ వాలంటీర్ చేతివాటం..రూ. 13 లక్షలకు పైగా నిధులు గోల్‌మాల్

కర్నూలు జిల్లాలో గ్రామ వాలంటీర్ చేతివాటం ప్రదర్శించాడు. ప్రభుత్వం మంజూరు చేసిన పంట నష్ట పరిహారం పంపిణీ లో అర్హులైన రైతులకు అందాల్సిన నగదును పక్కదారి మళ్లీంచాడంటూ.. గ్రామ వాలెంటరీ పై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు ఆందోళనకు దిగారు..

గ్రామ వాలంటీర్ చేతివాటం..రూ. 13 లక్షలకు పైగా నిధులు గోల్‌మాల్
Follow us

|

Updated on: Jun 03, 2020 | 6:15 PM

కర్నూలు జిల్లాలో గత ఏడాది అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. కుందూ నదికి పెద్ద ఎత్తున వరదలు రావడంతో కుందూ వెంట సాగుచేసిన పంట వేలాది ఎకరాల్లో నీట మునిగిపోయింది. దీంతో వందల సంఖ్యలో రైతుల్లు లక్షల్లో పంట నష్టపోయారు. కోవెల కుంట మండలంలో రెండు వేల రెండు వందల ఎకరాలకు పైగా సాగు చేసిన వరి, కంది, మిరప , జొన్న తదితర పంటలు వరద నీటిలో మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది… ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అధికారులు నష్టపోయిన 1034 మంది రైతుల జాబితాను రూపొందించారు. ఈ మేరకు సిద్ధం చేసిన జాబితాను ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి పూర్తి రివ్యూ అనంతరం 1034 మంది రైతులకు గానూ ఒక కోటి 19 లక్షల రూపాయల పంట నష్టపరిహారం మంజూరు చేశారు.

ఈ క్రమంలోనే జిల్లాలోని భీమునిపాడు గ్రామంలో 290 ఎకరాల్లో పంట నష్టం జరగగా 122 మంది రైతులకు రూ. 13 లక్షల 78 వేల నాలుగు వందల రూపాయల పంటనష్ట పరిహారం ఇటీవలె మంజూరు అయింది. అయితే, గ్రామానికి చెందిన గ్రామ వాలంటరీ రామ్ గోపాల్ రెడ్డి పంట నష్టపరిహారం జాబితా రూపొందించే సమయంలో అర్హుల రైతులకు బదులు తమ వారికి చెందిన అనర్హులై నా వారికి పెద్దపీట వేశాడు… నకిలీ రైతుల జాబితాను రూపొందించి అధికారులకు అందించాడు… అర్హులకు బదులు అనర్హులు ఈ నష్టపరిహారం పంపిణీలో లబ్ధి పొందారని..అధికారులతో కుమ్మక్కై నష్టపరిహారం నిధులను స్వాహా చేశారని గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం పై గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులను నిలదీయడంతో.. జరిగిన పొరపాటును గుర్తించిన వ్యవసాయ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు… స్వాహా చేసిన నష్టపరిహారం నిధులను వాలంటీర్ వద్ద నుండి రికవరీ చేస్తామంటూ అధికారులు హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళన విరమించారు.

దీనిపై సమాచారం అందుకున్న కోవెలకుంట్ల వ్యవసాయాధికారి నీరంజన్ రైతులతో చర్చించారు. పంట నష్టపరిహారం లో అవకతవకలకు పాల్పడిన గ్రామ వాలంటరీపై చర్యలు తీసుకునే పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అర్హులైన రైతులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.