చియాన్.. నటవిశ్వరూపం చూడతరమా..!

Vikram may be seen, చియాన్.. నటవిశ్వరూపం చూడతరమా..!

కమల్‌హాసన్‌ తర్వాత విభిన్న గెటప్‌లతో ప్రేక్షకులను అలరించడంలో తమిళ కథానాయకుడు విక్రమ్‌దిట్ట. ఆయన తన 58వ చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. దీనికి అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్‌ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఆయన 25 విభిన్న గెటప్‌లలో దర్శనమిస్తారని సమాచారం. అయితే, దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

అమెరికాకు చెందిన ఓ కంపెనీ ఆయన మేకప్‌, గెటప్‌లకు డిజైన్లు రెడీ చేస్తోంది. ఇదే నిజమైతే ప్రపంచంలోనే ఒక సినిమాలో 25 గెటప్‌లు వేసిన నటుడిగా విక్రమ్‌ రికార్డు సృష్టిస్తారు’ అని ఓ ఆంగ్ల పత్రిక తన కథనంలో రాసుకొచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి గతంలో విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చూస్తే మరోసారి విక్రమ్‌ విభిన్న గెటప్‌లలో కనిపించడం ఖాయమని తెలుస్తోంది

7 స్క్రీన్‌ స్టూడియోస్‌, వయకామ్‌ 18 స్టూడియోస్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఏప్రిల్‌ 2020లో విడుదల చేయాలని చూస్తున్నారు. ‘ఇది పాన్‌ ఇండియా సినిమా. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేస్తాం. వయకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌తో కలిసి భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నాం. చిత్ర పరిశ్రమలోని ప్రముఖ టెక్నీషియన్లు ఇందుకోసం పనిచేయనున్నారు’ అని చిత్ర నిర్మాణ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *