అక్రమ మద్యం కోసం మరో రూటు, ఏకంగా ఆర్టీసీ బస్సులో

సమస్యే లేదు. ఎన్ని దాడులు చేస్తున్నా, పత్యేక అధికారులను నియమించినా, కఠినమైన కేసులు పెడుతున్నా ఏపీలో అక్రమ మద్యం రవాణాకు బ్రేకులు పడటం లేదు.

అక్రమ మద్యం కోసం మరో రూటు, ఏకంగా ఆర్టీసీ బస్సులో
Follow us

|

Updated on: Sep 18, 2020 | 5:08 PM

సమస్యే లేదు. ఎన్ని దాడులు చేస్తున్నా, పత్యేక అధికారులను నియమించినా, కఠినమైన కేసులు పెడుతున్నా ఏపీలో అక్రమ మద్యం రవాణాకు బ్రేకులు పడటం లేదు. అందుకోసం అక్రమార్కులు కొత్త, కొత్త మార్గాలు ఎంచుకోని పోలీసులనే విస్మయానికి గురి చేస్తున్నారు. తాజాగా ఆర్టీసీ గూడ్స్(కార్గో) బస్సులో అక్రమ మద్యం రవాణా చేస్తూ బుక్కయ్యారు కేటుగాళ్లు.  హైదరాబాద్‌ నుంచి కొవ్వూరు డిపోకు బయలు దేరిన ఏపీ 29జెడ్‌ 0408 ఆర్టీసీ పార్శిల్‌ బస్సులో గురువారం విజయవాడ బెంజిసర్కిల్‌ వద్ద  అట్టపెట్టెలను దించుతున్నారు. అనుమానం రావడంతో పోలీసులు బస్సును చెక్ చేశారు. ఆ అట్టపెట్టల్లో మద్యం బాటిల్స్ దర్శనమిచ్చాయి. మొత్తం 2198 మద్యం సీసాలను విజయవాడ నుంచి ఏలూరుకు సరఫరా చేస్తూ అడ్డంగా దొరికిపోయారు.  బస్సు డ్రైవర్లు తోట నాగరాజు, గమిడి నాగరాజు, మెకానిక్‌ ఎం.శ్రీనివాసరావుతో పాటు విజయవాడలో పార్శిల్స్‌ను తీసుకునేందుకు వచ్చిన కె.సుబ్రహ్మణ్యం, కె.అప్పల నాయుడులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొరికిన మద్యం విలువ రూ.11.3 లక్షలు ఉంటుందని తెలిపారు.  ఆర్టీసీ బస్సు ఆంధ్రప్రదేశ్ కు చెందింది కావడంతో కొవ్వూరు డిపోకు సమాచారం అందించారు.

Also Read :

ఏపీలో హార్టికల్చర్ ఎంఎస్సీ, పీహెచ్ డీ విద్యార్థులకు స్టైఫండ్ పెంపు

ఏపీలో పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధింపు

వైఎస్ వివేకా హత్యకేసులో లేటెస్ట్ అప్డేట్

అవును ప్రభాసే, నమ్మండి !

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!