కరోనా ఆస్పత్రిలో వృద్ధుడు మిస్సింగ్‌ కేసులో అదిరిపోయే ట్విస్ట్..

క్రోవిడ్ ఆసుపత్రిలో వృద్ధుడు వసంతరావు ఆచూకీ లభ్యమైంది. గత నెల 24వ తేది అర్థరాత్రి క్రోవిడ్ ఆసుపత్రిలో వృద్ధుడు మృతి చెందాడు. అనంతరం మార్చూరుకి తరలించారు వైద్య సిబ్బంది. ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా వృద్ధుడు మరణించినా..

కరోనా ఆస్పత్రిలో వృద్ధుడు మిస్సింగ్‌ కేసులో అదిరిపోయే ట్విస్ట్..
Follow us

| Edited By:

Updated on: Jul 03, 2020 | 5:55 PM

విజయవాడ కోవిడ్ ఆసుపత్రిలో వసంతరావు అనే వృద్దుడు అదృశ్యం కావడం.. జిల్లా వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. వారం అయినా అతని ఆచూకీ ఇంకా లభించక పోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసుల నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మిస్సింగ్ కేసును ఛేదించారు.

కోవిడ్ ఆసుపత్రిలో వృద్ధుడు వసంతరావు ఆచూకీ లభ్యమైంది. గత నెల 24వ తేది అర్థరాత్రి కరోనా ఆసుపత్రిలో వృద్ధుడు మృతి చెందాడు. అనంతరం మార్చూరుకి తరలించారు వైద్య సిబ్బంది. ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా వృద్ధుడు మరణించినా.. విషయం ఇంకా తెలియ రాలేదు. వృద్ధుడు వివరాలను కూడా ఆసుపత్రి రికార్డుల్లో నమోదుచేయలేదు సిబ్బంది. దీంతో ఈ వసంతారావు కేసు మిస్టరీగా మారింది.

పోలీసుల రంగప్రవేశంతో వృద్ధుడు ఆచూకీ లభ్యమైంది. ఆసుపత్రి సీసీ కెమెరాలలో వృద్ధుడు ఆచూకీ గమనించారు పోలీసులు. వృద్ధుడు చనిపోవడంతో మార్చురీకి తరలించారు ఆస్పత్రి సిబ్బంది. మార్చురీలో ఉన్న మృతదేహం వసంతరావుది కావడంతో కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇక డాక్టర్లు తీరుపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read More:

బ్రేకింగ్: జులై 31 వరకు ఇంటర్నేషనల్ విమానాలు రద్దు

ఇక తెలంగాణలో ర్యాపిడ్ టెస్టులు.. అరగంటలో రిజల్ట్..