రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో శుక్రవారం నుంచి అత్యంత ఘనంగా శాకంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆలయాలను మూసివేసి.. ఇటీవలే భక్తులకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా పలు రకాలైన కూరగాయలతో అమ్మవారిని అలంకరించనున్నారు. దుర్గమ్మ తల్లి మూడు రోజులపాటు శాకంబరీ దేవిగా దర్శనం ఇవ్వనున్నారు. రోజుకు ఆరు వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. అందుకోసం అమ్మవారి […]

రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు
Follow us

|

Updated on: Jul 02, 2020 | 10:30 PM

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో శుక్రవారం నుంచి అత్యంత ఘనంగా శాకంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆలయాలను మూసివేసి.. ఇటీవలే భక్తులకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా పలు రకాలైన కూరగాయలతో అమ్మవారిని అలంకరించనున్నారు. దుర్గమ్మ తల్లి మూడు రోజులపాటు శాకంబరీ దేవిగా దర్శనం ఇవ్వనున్నారు.

రోజుకు ఆరు వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. అందుకోసం అమ్మవారి దర్శనం టికెట్లను ఆన్లైన్ ద్వారా తీసుకునే వెసులుబాటుకల్పించనున్నారు. అమ్మవారి దర్శనం కోసం టికెట్లను ఆన్‌లైన్ ద్వారా తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఇదే సమయంలో అమ్మవారి ఆలయంలో కేశఖండనశాల సైతం ఇప్పటికే ప్రారంభమయ్యింది. దానికి సంబంధించి అధికారులు గంటకు 90 టికెట్లను విక్రయిస్తున్నారు.