ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఏర్పాట్లు..

దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ యేడు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు సెప్టెంబర్‌ 29న మొదలై అక్టోబర్‌ 8న దసరా పండుగ రోజు వరకూ కొనసాగనున్నాయి. ఈ ఏడాది దసరా ఉత్సవాలలో 8లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారని అధికారులు అంచనావేశారు. రాష్ట్రం నుంచే కాకుండా పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా తదితర రాష్టాల్ర […]

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఏర్పాట్లు..
Follow us

|

Updated on: Sep 06, 2019 | 5:37 PM

దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ యేడు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు సెప్టెంబర్‌ 29న మొదలై అక్టోబర్‌ 8న దసరా పండుగ రోజు వరకూ కొనసాగనున్నాయి. ఈ ఏడాది దసరా ఉత్సవాలలో 8లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారని అధికారులు అంచనావేశారు. రాష్ట్రం నుంచే కాకుండా పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా తదితర రాష్టాల్ర నుంచి భక్తులు ప్రతి ఏటా అమ్మవారి దర్శనానికి తరలివస్తుంటారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో దుర్గ గుడి కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్‌బాబు, డిప్యూటీ కలెక్టరు చక్రపాణి, డీసీపీ విజయరావు, వన్‌టౌన్‌ సీఐ కాశీవిశ్వనాథ్‌, ట్రాఫిక అధికారుల బృందం  క్షేత్రస్థాయిలో పర్యటించి దసరా ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం చేయాల్సిన ఏర్పాట్ల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ప్రతీ సంవత్సరంలాగానే… క్యూ లైన్లు రథం సెంటర్ దగ్గరున్న వినాయక స్వామి గుడి నుంచీ ప్రారంభమవుతాయిని ఆలయ ఈవో సురేష్ బాబు తెలిపారు. భక్తులకు ఉచితంగా మజ్జిగ… మంచినీరు ప్యాకెట్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఇంద్రకీలాద్రి కింద నుంచీ దుర్గ గుడిని చేరేందుకు… తొమ్మిది బస్సుల్ని ఏర్పాటు చేస్తున్నామని,.. దాతలు కోరుకుంటే వారి పేరు మీద ఒక రోజు బస్సు ట్రిప్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఇక అమ్మవారి పుష్ప అలంకరణ కోసం రోజుకు రూ.1.50 లక్షల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. భక్తులకు ఉచిత ప్రసాద పంపిణీ జరుగుతుందన్న ఈవో సురేష్ బాబు.. ఏదైనా ఓ అనాథ ఆశ్రమంలో ఉండే వారి కోసం రెండు లేదా మూడో రోజున ఉచిత దర్శనం ఏర్పాటు చేస్తామన్నారు. ఈసారి అమ్మవారి ఊరేగింపు ముందు చతురంగ బలాల కవాతు ఉంటుందని వివరించారు. దసరా ఉత్సవాల్లో 20 లక్షల లడ్డూలు… 16 లక్షల పులిహోర ప్యాకెట్లు అమ్ముడవుతాయని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. అప్పాల ప్రసాదం పెంచాలనుకుంటున్నా… ఎండోమెంట్ కమిషనర్ నుంచీ అనుమతి రావాల్సి ఉందన్నారు. దసరా ఉత్సవాల కోసం మూడేళ్లుగా ప్రభుత్వం నుంచీ ఎలాంటి నిధులూ రావట్లేదన్న ఈవో… రాష్ట్ర పండుగగా ప్రకటించారు కాబట్టి… సీఎం జగన్ ఈసారి ప్రత్యేక నిధులు ఇస్తారని ఆశిస్తున్నామన్నారు ఈవో సురేష్ బాబు,. గతేడాది దసరా ఉత్సవాల కోసం రూ.6.87 కోట్ల ఖర్చు అయ్యిందన్న ఆయన… ఈసారి ఖర్చును తగ్గించడానికి యత్నిస్తున్నామని వారు స్పష్టం చేశారు. ఈనెల 7న అంటే శనివారం దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, కమిషనర్‌ మొవ్వ పద్మ సమక్షంలో దసరా ఏర్పాట్లపై పూర్తిస్థాయి సవిూక్షా సమావేశం నిర్వహించనున్నట్టు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం వారు స్పష్టం చేశారు.
4 Attachments