Breaking News
  • శ్రీకాకుళం: కచరాంలో తృప్తి రిసార్ట్‌ యాజమాన్యం నిర్వాకం. రోడ్లపై గుర్రపు స్వారీ నిర్వహించిన తృప్తి రిసార్ట్‌ యాజమాన్యం. బైక్‌పై వెళ్తున్న రాంబాబు, రమాదేవి దంపతులను గుద్దిన గుర్రం. ఆస్పత్రిలో రాంబాబు పరిస్థితి విషమం. పట్టించుకోని రిసార్ట్‌ యాజమాన్యం. రాసార్ట్‌ ఎదుట స్థానికుల ఆందోళన, పరిస్థితి ఉద్రిక్తం. భారీగా మోహరించిన పోలీసులు.
  • ప.గో: తణుకు మండలం దువ్వలో పిచ్చికుక్క స్వైర విహారం. పిచ్చికుక్క దాడిలో10 మందికి గాయాలు.
  • గుంటూరు: సత్తెనపల్లిలో మహిళ ఆత్మహత్యాయత్నం. చోరీ కేసు పెట్టారన్న మనస్థాపంతో నిద్రమాత్రలు మింగిన లక్ష్మీ. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • అనంతపురం: కదిరి మండలం నడిమిపల్లిలో దారుణం. యువకుడు సుధాకర్‌ గొంతు కోసిన దుండగులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుధాకర్‌. గతంలో రామాంజనేయులు భార్యను ఎత్తుకెళ్లి.. తిరిగి అప్పగించిన సుధాకర్‌. రామాంజనేయులుపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు.
  • అనంతపురం: హిందూపురంలో రెచ్చిపోయిన వీధికుక్కలు. ఇద్దరు చిన్నారులపై దాడి. వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారులు. ఆస్పత్రికి తరలింపు, పరిస్థితి విషమం.
  • విజయవాడ: వంశీ వ్యాఖ్యలపై అయ్యప్ప భక్త కమిటీ అభ్యంతరం. టీవీ9 డిబేట్‌లో వంశీ అనుచిత వ్యాఖ్యలు సరికాదు. అయ్యప్ప మాలలో ఉన్న భక్తులు రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. పరుష పదజాలంతో భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. అయ్యప్ప భక్తులకు వంశీ కళంకం తెచ్చారు. ఇప్పటికైనా నియమనిష్టలతో దీక్ష చేయాలి-వేణుగోపాలస్వామి.
  • హైదరాబాద్‌: అశ్వత్థామరెడ్డి నివాసానికి వెళ్లిన ఎంపీ కోమటిరెడ్డి. అశ్వత్థామరెడ్డిని పరామర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అందరూ ముందుకు రావాలి. అశ్వత్థామరెడ్డికి ఏం జరిగినా సీఎం కేసీఆర్‌దే బాధ్యత. కార్మికుల సమస్యలు ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలి. సడక్‌బంద్‌ను విజయవంతం చేయాలి-ఎంపీ కోమటిరెడ్డి.

మీరు మటన్ తింటున్నారా..? అయితే ఫట్టే..!!

సండే రోజున ముక్క లేనిదే ముద్ద దిగదని మాంసం ప్రియులు చెబుతుంటారు. ఇక పండుగలు, శుభకార్యాలు, విందులకు చెప్పేదేముంది.. నాన్‌ వెజ్‌ మస్ట్‌ అయిపోయింది. మేక, గొర్రె ఖరీదైనా సరే.. కొనేస్తున్నారు. కానీ.. మీరు తింటున్న మటన్‌ మంచిదేనా? షాపుల్లో కొంటున్న మాంసం నాణ్యమైనదేనా? విజయవాడ కబేలాలో పరిస్థితిని చూస్తే విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి.

సాధారణంగా మాంసాన్ని విక్రయించాలంటే ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్‌ పర్మిషన్‌ కంపల్సరీ. అది తినడానికి పనికొస్తుందో లేదో ఆయనే నిర్ధారించాలి. తర్వాతే విక్రయించాలి. కానీ.. విజయవాడ కబేలాలో మాత్రం అలా జరగడం లేదు. ఇక్కడ మీట్‌ స్టాంపింగ్‌ దందా జరుగుతోంది. ఓ మేకను గానీ.. గొర్రెను గానీ.. స్లాటర్‌ చేయాలంటే రూల్స్‌ ప్రకారం 24 గంటలపాటు అబ్జర్వేషన్‌లో పెట్టాలి. అవి ఆరోగ్యంగా ఉన్నాయని తేలిన తర్వాతే స్లాటర్‌ చెయ్యాలి.

ప్రతి కబేలా సెంటర్‌లో పశువైద్య అధికారి పరిశీలించాకే మున్సిపల్‌ అధికారులు స్టాంప్‌ చెయ్యాలి. అయితే.. విజయవాడలో మాత్రం పరిస్థితి రివర్స్‌గా ఉంది. అధికారుల నిర్లక్ష్యం.. కాసుల కక్కుర్తితో ఇక్కడ స్టాంపింగ్‌ యథేచ్ఛగా సాగుతోంది. అపరిశుభ్ర ఏరియాలో ఇష్టం వచ్చినట్లు స్లాటర్‌ చేస్తున్నారు. దీనివల్ల రోగాలు ప్రబలే అవకాశం ఉంది. మేక, గొర్రె అనారోగ్యంగా ఉన్నా కూడా షాపులకు తరలించేస్తున్నారు. ఇక షాపుల్లో పరిస్థితి చెప్పేదేముంది. రోడ్ల పక్కనే ఉంటాయి.. ఆరుబయటే మాంసం వేలాడుతూ ఉంటుంది. వాహనాల దుమ్ము, దూళి అంతా మాంసంపై పడుతూ ఉంటుంది.