పార్టీ మార్పుపై రాములమ్మ స్పందన.. సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విజయశాంతి పార్టీ మారనున్నారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి రాములమ్మ గుడ్‌బై చెప్పి.. త్వరలో తన సొంత గూడు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పుకార్లు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు విజయశాంతి. ‘‘కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు నన్ను కాంగ్రెస్ నుంచి బలవంతంగా బయటికి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతుందని […]

పార్టీ మార్పుపై రాములమ్మ స్పందన.. సంచలన వ్యాఖ్యలు
Follow us

| Edited By:

Updated on: Aug 16, 2019 | 4:26 PM

తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విజయశాంతి పార్టీ మారనున్నారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి రాములమ్మ గుడ్‌బై చెప్పి.. త్వరలో తన సొంత గూడు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పుకార్లు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు విజయశాంతి.

‘‘కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు నన్ను కాంగ్రెస్ నుంచి బలవంతంగా బయటికి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతుందని నేను పార్టీని వీడను’’ అంటూ పేర్కొన్నారు. ఇక పార్టీ మార్పు అన్నది తాను ఒక్కదాన్ని తీసుకునే నిర్ణయం కాదని.. తన కుటుంబసభ్యులు, రాజకీయ నాయకులు, అనుచరులు అందరితో చర్చించిన తరువాతే తన తదుపరి నిర్ణయం ఉంటుందని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే రాజకీయాలు పక్కనపెడితే 13ఏళ్ల తరువాత టాలీవుడ్‌కు విజయశాంతి ఎంట్రీ ఇస్తోంది. మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సరిలేరు నీకెవ్వరులో కీలకపాత్రలో కనిపించనుంది విజయశాంతి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.