కమలంతో మళ్లీ చెలిమి.. రాములమ్మ అదే గూటికి..?

ఇటీవలే సినిమాల్లోకి రీ ఎంట్రీ ప్రకటించినప్పటికీ.. రాజకీయాలను మాత్రం వదలడం లేదు విజయశాంతి. రాజకీయాలు రాజకీయాలే.. సినిమాలు సినిమాలే అన్న సూత్రాన్ని ఆమె ఫాలో అవుతోంది. అయితే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఆమె.. త్వరలో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతల తీరుతో ఆమెకు విసుగువచ్చినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీలోకి వెళ్లాలన్న నిర్ణయంలో రాములమ్మ ఉన్నట్లు సమాచారం. అయితే మొదట తన రాజకీయ ప్రస్థానాన్ని బీజేపీలోనే ప్రారంభించారు విజయశాంతి. అప్పటినుంచి బీజేపీలోకి […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:59 am, Sat, 3 August 19

ఇటీవలే సినిమాల్లోకి రీ ఎంట్రీ ప్రకటించినప్పటికీ.. రాజకీయాలను మాత్రం వదలడం లేదు విజయశాంతి. రాజకీయాలు రాజకీయాలే.. సినిమాలు సినిమాలే అన్న సూత్రాన్ని ఆమె ఫాలో అవుతోంది. అయితే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఆమె.. త్వరలో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతల తీరుతో ఆమెకు విసుగువచ్చినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీలోకి వెళ్లాలన్న నిర్ణయంలో రాములమ్మ ఉన్నట్లు సమాచారం.

అయితే మొదట తన రాజకీయ ప్రస్థానాన్ని బీజేపీలోనే ప్రారంభించారు విజయశాంతి. అప్పటినుంచి బీజేపీలోకి కేంద్ర నేతలతో ఆమెకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఇప్పటికీ వాటిని ఆమె అలానే కొనసాగిస్తున్నారని అనుచరులు అంటున్నారు. ఈ నేపథ్యంలోొ త్వరలోనే విజయశాంతి కేంద్రమంత్రి అమిత్‌షాను ఆమె కలవనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాలన్న అమిత్ షా నిర్ణయంతో.. బీజేపీ నాయకులు ఆమెతో రెండు సార్లు సంప్రదింపులు జరిపారని కూడా టాక్. మరి మొత్తానికి విజయశాంతి కాంగ్రెస్‌కి ‘హ్యాండ్’ ఇస్తుందో..? లేదో చూడాలంటే కొద్ది రోజులు చూడాల్సిందే.