Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్షల 36 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 236657. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 115942. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 114073. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6642. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి.. సచివాలయంలో కరోనా కలకలం ఈ రోజు మరో ఐదు పాజిటివ్ కేసులు నమోదు మొత్తం 9 కి చేరిన పాజిటివ్ కేసులు అసెంబ్లీలో ఒక పాజిటివ్ కేసు నమోదు.
  • అమర్‌నాథ్ యాత్రకు పచ్చజెండా. జులై 21 నుంచి ఆగస్టు 3 వరకు యాత్ర. 15 రోజులు మాత్రమే యాత్రా సమయం. 55ఏళ్లు పైబడినవారికి యాత్రకు అనుమతి లేదు. కోవిడ్-19 జాగ్రత్తలతో యాత్రకు ఏర్పాట్లు. కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికెట్లు ఉన్నవారికి మాత్రమే అనుమతి. బాల్తాల్ మార్గంలో మాత్రమే యాత్రకు అనుమతి. పహల్‌గాం వైపు నుంచి ఉన్న యాత్రామార్గం మూసివేత.
  • తెలంగాణ లో జిమ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంతోష్. తెలంగాణ లో జిమ్ ల నిర్వహణకు అనుమతివ్వండి. కోవిడ్ నిబంధనలకు లోబడి జిమ్ లను నిర్వహిస్తాం. ప్రభుత్వానికి తెలంగాణ జిమ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ . జిమ్ లను నమ్ముకుని ఎన్నో కుటుంబాలు ఆదారపడి ఉన్నాయి. జిమ్ ల తెరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలివ్వాలి. తెలంగాణ వ్యాప్తంగా 5 వేల జిమ్ ల్లో 50 వేల మంది ఆధారపడిన ఇండస్ట్రీ.
  • కర్నూలు: భూమా అఖిలప్రియ ఏ వి సుబ్బారెడ్డి మధ్య విభేదాలు వారి వ్యక్తిగతం. తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు... టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు.
  • విశాఖ: దివ్య కేసులో కొనసాగుతున్న పోలీస్ దర్యాప్తు. రావులపాలెం నుంచి దివ్య పిన్ని కృష్ణవేణిని పిలిపించిన పోళిసులు. దివ్య కేసులో మరికొంతమంది పాత్రపై ఆరా తీస్తున్న పోలీసులు. ఇప్పటికే వసంతతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. దివ్య ఘటనపై విచారణ జరుపుతున్నాం. తొలుత అనుమానాస్పద మృతికేసు నమోదు చేశాం.. పలుకోణాల్లో విచారిస్తున్నాం: డీసీపీ రంగారెడ్డి.

ఎక్కడున్నా ఆమె ఓ అమూల్యమైన పోల్ స్టారే..!

Vijayshanthi plank card for bjp, ఎక్కడున్నా ఆమె ఓ అమూల్యమైన పోల్ స్టారే..!

విజయశాంతి.. ఏ మాత్రం పరిచయం అక్కర లేని పేరు. సినీ రంగంలో హీరోలను డామినేట్ చేసేంతటి కెపాసిటీ సంపాదించుకున్న ఈ లేడీ సూపర్ స్టార్ ఇపుడు కాంగ్రెస్, బిజెపిల ప్లాంక్  కార్డుగా మారారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కన్వీనర్ గా వ్యవహరించిన విజయశాంతి.. జనరల్ ఎన్నికల తర్వాత సైలెంటయ్యారు. దొరికిన ఖాళీ సమయాన్ని వినియోగించుకుంటూ 13 ఏళ్ళ తర్వాత మొహానికి మేకప్ వేసుకుని, సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా చేస్తున్న సరిలేరు నీకెవ్వరు.. మూవీలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. సినిమాలో నటిస్తూనే.. పొలిటికల్ సెటైర్లు విసురుతున్నారు విజయశాంతి. తాజాగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన లేడీ అమితాబ్.. రాజకీయంగా తాను యాక్టివ్ గానే వున్నట్లు చాటుకున్నారు. అయితే.. విజయశాంతి రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పకపోవడంతో పలు పార్టీలు విజయశాంతిని తమ తదుపరి ఎన్నికల ప్లాంక్ కార్డులా వాడుకునేందుకు వ్యూహరచన చేస్తున్నాయి.

Vijayshanthi plank card for bjp, ఎక్కడున్నా ఆమె ఓ అమూల్యమైన పోల్ స్టారే..!

కాంగ్రెస్ పార్టీకి ప్రచార కన్వీనర్ గా వ్యవహరించిన విజయశాంతి.. గత నవంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యధాశక్తి ప్రచారం నిర్వహించారు. అయితే ఆనాటి ఎన్నికల్లోను, ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లోను తెలంగాణ కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందలేక చతికిలా పడింది. ఆ తర్వాత దాదాపు సైలెంటై పోయిన విజయశాంతి త్వరలో బిజెపిలో చేరుతున్నారని కమలనాథులు… లేదు తమ పార్టీలోనే వుంటారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గతంలో బిజెపిలో కొనసాగిన విజయశాంతి.. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కొంత కాలం టిఆర్ఎస్ పార్టీలో కొనసాగారు. కెసీఆర్ తనకు తగిన స్థాయిలో ప్రాధాన్యత  ఇవ్వడం లేదంటూ టిఆర్ఎస్ ను వీడిన రాములమ్మ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. రాష్ట్రం ఇచ్చిందంటూ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

Vijayshanthi plank card for bjp, ఎక్కడున్నా ఆమె ఓ అమూల్యమైన పోల్ స్టారే..!

 

అయితే తాజాగా.. విజయశాంతిని బిజెపిలోకి చేర్చుకునేందుకు కమల దళం ప్రయత్నిస్తోంది. ఇటీవల మాజీ గవర్నర్ గా మారి.. రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ గా మారిన సి.హెచ్. విద్యాసాగర్  రావు విజయశాంతిని పార్టీలోకి రప్పించేందుకు యథాశక్తి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆమె కూడా సానుకూలంగానే వున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేదని భావిస్తున్న విజయశాంతి బిజెపిలో చేరడం దాదాపు ఖాయమని చెబుతున్నారు. తాను నటిస్తున్న సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత మోదీ లేదా అమిత్ షా సమక్షంలో విజయశాంతి కమలం పార్టీలో చేరతారని విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్.. ఇటు బిజెపి విజయశాంతిని వచ్చే ఎన్నికల్లో తమకు ప్లాంక్ కార్డుగానే భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయశాంతి తీసుకునే నిర్ణయం ఆసక్తికరంగా మారింది.

Related Tags