Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 82 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 182143. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89995. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 86984. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5164. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ గా ఏ.పరమేశంను నియమించిన కేంద్ర జలవనరుల శాఖ. ఇప్పటి వరకు కేఆర్ ఎంబి మెంబర్ సెక్రటరీగా కొనసాగుతూ వచ్చిన పరమేశం. పరమేశంను కృష్ణా బోర్డు చైర్మన్ గా నియమించిన ఆదేశాలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసిన జలవనరుల శాఖ. ప్రస్తుతం కృష్ణా బోర్డు ఇంచార్జి చైర్మన్ వ్యవహరించిన గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్.
  • చిత్తూరు జిల్లా : ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో మిడతల దండు. అయితే ఇవి మహారాష్ట్రనుంచి వచ్చిన మిడతల దండు కాదంటున్న అధికారులు. కుప్పం సరిహద్దులోని తమిళనాడు వేపనపల్లి లో ప్రత్యక్షమైన మిడతల దండు. రాత్రికి రాత్రే పంటలు నాశనం చేస్తున్న మిడతలు. పచ్చగా కనిపించిన ప్రతి చెట్టుని తినేస్తున్న మిడతలు. అరటి చెట్లను వదలని మిడతలు. రంగంలోకి దిగిన అధికారులు..మిడతల పై ఫెర్టిలైజర్స్ చల్లి తరిమి కొట్టే ప్రయత్నం.
  • అమరావతి: నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియమిస్తూ ఇచ్చిన సర్కులర్ ఉపసంహరణ. సర్కులర్ ఉపసంహరించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.
  • కృష్ణ జిల్లా: ఆంధ్రా-తెలంగాణ చెక్ పోస్ట్ వద్ద భారీగా బంగారం, నగదు పట్టివేత. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా పేపర్ రవాణా కారులో తరలిస్తు పట్టుబడిన వైనం. *1Kg,53 గ్రాముల బంగారం,వెండి 9.Kg ల 450 గ్రాముల,53,లక్షల 28,500 డబ్బులు స్వాధీనం. 1.3765 వేల రూపాయల బంగారం ,నగదు స్వాధీనం.
  • ఖేల్ రత్నా అవార్డు కు రోహిత్ శర్మను పేరు ని ప్రతిపాదించిన బిసిసిఐ. అర్జున అవార్డుకు శిఖర్ ధావన్, ఇశాంత్ శర్మ, దీప్తి శర్మ పేర్లను ప్రతిపాదించిన బిసిసిఐ.

సంచి పట్టి.. పంచె కట్టి.. రైతు బజార్‌లోకి ఎంటర్‌..ఎవరో తెలుసా..?

vijayanagaram dist raithu bazar visited dist joint collector for checking rates, సంచి పట్టి.. పంచె కట్టి.. రైతు బజార్‌లోకి ఎంటర్‌..ఎవరో తెలుసా..?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రవాణా పూర్తిగా స్థంభించిపోయింది. అయితే ఇందులో నిత్యవసర వస్తువులను ఇబ్బందులు తలెత్తుకుండా.. ప్రభుత్వం ఎమర్జెన్సీ సర్వీసులకు ఈ లాక్‌డౌన్‌లో మినహాయింపు ఇచ్చింది. అయితే ఇదే అదనుగా పలుచోట్ల వ్యాపారస్తులు.. సామాన్య ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. ఇక రైతు బజార్లలో కూరగాయల ధరలను నియంత్రించేందుకు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరలకు మార్కెట్ వ్యాపారులు అమ్ముతున్నారా..?లేక అధిక ధరలకు విక్రయిస్తున్నారా అన్న దానిపై ఎంక్వైరీ చేసేందుకు విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ రంగంలోకి దిగారు.

లాక్‌డౌన్‌ ఉన్న సమయంలో మార్కెట్‌లో కూరగాయలు.. నిత్యావసర వస్తువుల ధరలను కొందరు వ్యాపారస్థులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్వయంగా జిల్లా జాయింట్ కలెక్టర్ కిశోర్‌ మారువేషంలో రంగంలోకి దిగారు. ఇందులో నిజమెంతో తెలుసుకునేందుకు రాజీవ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌కు వెళ్లారు.. వినియోగదారుడిలా కూరగాయలు, నిత్యావసర వస్తువులను బేరమాడుతూ కొనుకున్నారు. దాదాపు మార్కెట్‌లోని అన్ని షాపుల దగ్గరకు వెళ్లి.. ధరల్ని అడిగి తెలుసుకున్నారు. ఇలా సడన్‌గా సామాన్యుడిలా మార్కెట్‌లో ఎంటర్‌ అయ్యింది జిల్లా జాయింట్ కలెక్టర్‌ అని తెలుసుకుని షాక్ తిన్నారు. అయితే షాపింగ్‌ ముగిసిన తర్వాత.. మార్కెట్‌లో ధరలు దాదాపు నియంత్రణలోనే ఉన్నట్లు తెలుసుకున్నారు. ఇక ఉల్లి, టమాట మాత్రం అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలుసుకున్నారు.

Related Tags