కోడెల కూతురు విజయలక్ష్మీ ఏమన్నారంటే..?

Vijayalaxmi Reaction On Kodela Suicide, కోడెల కూతురు విజయలక్ష్మీ ఏమన్నారంటే..?

కోడెల శివప్రసాదరావు మరణం పై ఆయన కూతురు విజయలక్ష్మీ స్పందించారు. ఉదయం లేచిన తర్వాత మేడ పైన ఉన్న బెడ్ రూంలోకి వెళ్లి తలుపు వేసుకున్నారని చెప్పారు. అరగంటకు పైగా ఆయన కిందకు రాకపోవడంతో అనుమానం వచ్చి గదిలోకి వెళ్లి చూడగా.. నాన్న హ్యాంగింగ్‌కి వేలాడుతూ ఉండటంతో ఏం చేయాలో అర్థం కాలేదన్నారు. తరువాత గన్‌మెన్, డ్రైవర్ సహాయంతో ఆస్పత్రికి తరలించామన్నారు. నాన్న చనిపోయేముందు ఎటువంటి సూసైడ్ నోట్ రాయలేదని ఆమె తెలిపారు. అయితే చాలా రోజులుగా రాజకీయంగా వస్తున్న ఆరోపణల వల్ల బాధతో ఉన్నారని అన్నారు. ఆయన చనిపోవడం వెనుక ఎలాంటి అనుమానాలు లేదని విజయలక్ష్మీ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *