ప్రిన్స్‌తో.. రాములమ్మ ఓకేనా..?

80, 90లలో టాప్ హీరోలకు ధీటుగా నటించి లేడి అమితాబ్‌గా పేరొందిన విజయశాంతి.. 13సంవత్సరాలుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. అప్పటి నుంచి ఆమె రాజకీయాలలో బిజీగా మారిపోయింది. అయితే అప్పటి హీరోయిన్లు ఓ వైపు రాజకీయాల్లో కొనసాగుతూ.. మరోవైపు ఇప్పటికీ సినిమాలు చేస్తుండగా విజయశాంతి మాత్రం ఇటు సైడ్ కూడా చూడలేదు. ఆమెను వెండితెరపైకి రీ ఎంట్రీ ఇప్పించాలని చాలామంది దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేసినప్పటికీ.. అవన్నీ విఫలమయ్యాయి. అయితే ఇన్నేళ్ల తరువాత రాములమ్మను మళ్లీ వెండితెర మీద మెరిపించేందుకు యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఒప్పించాడట.

సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి ఓ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఈ మూవీలో కీలక పాత్రలో నటించేందుకు విజయశాంతిని అనిల్ కన్విన్స్ చేశాడని సమాచారం. పాత్ర ప్రాధాన్యత.. కాంబినేషన్ సీన్స్ గురించి ఆయన వివరించిన తీరుకు ఇంప్రెస్ అయిన రాములమ్మ.. ఇందులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *