తెలంగాణ కాంగ్రెస్ కు డబల్ షాక్… ఆ ఇద్దరిది చెరో దారి..

తెలంగాణ కాంగ్రెస్‌ కు డబల్ షాక్ తగలబోతోందా ? పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తోంది. ఒకే ఇద్దరు కృషియల్ నేతలు పార్టీకి షాకివ్వబోతున్నారా ? విశ్వసనీయ సమాచారం అలాగే ఉంది. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాడు పార్టీలో అత్యంత కీలకంగా కనిపించిన ఆ ఇద్దరు నేతలు పార్టీని వీడబోతున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరా అనే కదా మీ సందేహం ? గత రెండు రోజులుగా ఈ అంశంపై రాజకీయ […]

తెలంగాణ కాంగ్రెస్ కు డబల్ షాక్... ఆ ఇద్దరిది చెరో దారి..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 30, 2019 | 5:49 PM

తెలంగాణ కాంగ్రెస్‌ కు డబల్ షాక్ తగలబోతోందా ? పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తోంది. ఒకే ఇద్దరు కృషియల్ నేతలు పార్టీకి షాకివ్వబోతున్నారా ? విశ్వసనీయ సమాచారం అలాగే ఉంది. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాడు పార్టీలో అత్యంత కీలకంగా కనిపించిన ఆ ఇద్దరు నేతలు పార్టీని వీడబోతున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరా అనే కదా మీ సందేహం ?

గత రెండు రోజులుగా ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇది కాంగ్రెస్ నేతల్లో కలవరం పుట్టిస్తోంది. త్వరలో హుజూర్‌నగర్‌కు ఉపఎన్నిక జరుగుతున్న సమయం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపి అజారుద్దీన్, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార సారథి, సినీ నటి విజయశాంతి హస్తం పార్టీకి గుడ్‌పై చెప్పేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవలే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహ్మద్ అజారుద్దీన్ రెండు రోజుల క్రితం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారిద్దరూ మధ్య కొద్దిసేపు రాజకీయ అంశాలపై చర్చించినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును సైతం అజారుద్దీన్ త్వర లో కలువనున్నారని తెలుస్తోంది. అనంతరం కాంగ్రెస్ పార్టీ మార్పుపై అజారుద్దీన్ స్పష్టమై న ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. భార త్ మాజీ క్రికెటర్‌గా తెలంగాణ ప్రజల్లో అజారుద్దీన్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. పైగా ము స్లిం వర్గానికి చెందిన ఆయనను టిఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం ద్వారా ఆ వర్గం ప్రజలను మరి ంత ఆకట్టుకోవాలన్నది గులాబీ పార్టీ వ్యూ హాంగా కనిపిస్తోంది. అందుకే ఇటీవల జరిగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో అజారుద్దీన్ కు టి.ఆర్.ఎస్. నేతలు పరోక్షంగా సహకరించారు. గతంలో టి.ఆర్.ఎస్.లో వుంది ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ జి.వివేక్ వెంకట స్వామికి వ్యతిరేకంగా అజహరుద్దీన్ వర్గానికి టి.ఆర్.ఎస్. నేతలు పని చేశారు. దాంతో అజారుద్దీన్ విజయం నల్లేరు మీద నడకే అయింది. అందుకే.. గెలిచిన వెంటనే అజారుద్దీన్ తెలంగాణ మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు అయినా కె.టి.ఆర్.ను కలిశారు. ఇక కెసిఆర్ ను కలవడం.. పార్టీలో చేరడం లాంఛనమే అన్న ప్రచారం ఇపుడు రాజధానిలో జోరుగా సాగుతోంది.

మరోవైపు విజయశాంతి కూడా హస్తం పార్టీకి గుడ్‌ బాయ్ చెప్పేయోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఆమె కమలం పార్టీలో చేరనున్నారని సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో బిజెపిని బలమైన పార్టీగా తీర్చిదిద్దడంతో పాటు తెలంగాణపై కాషాయ జెండా ఎగురవేయాలన్న లక్షంతో ఆ పార్టీ అధిష్టానం పక్కగా ప్రణాళికలను అమలు చేస్తోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలకు చెందిన బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా రాష్ట్రంలో బిజెపిని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే విజయశాంతికి ప్రజల్లో ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఆమె పార్టీలోకి చేర్చుకోవాలని బిజెపి అధిష్టానం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు సైతం దాదాపుగా పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దసరా పండుగ ఉత్సవాల్లోనే విజయశాంతి కమలం పార్టీ తీర్థం పుచ్చుకోవడం దాదాపుగా ఖాయమని తెలుస్తోంది. విజయశాంతికి ఒకరకంగా రాజకీయ గురువు అయినా విద్యాసాగర్ రావు.. ఇటీవల గవర్నర్ పదవి పోగా, తెలంగాణ బీజేపీలో కీలక నేతగా మారేందుకు సిద్ధమవుతున్నారు. అయన భవిష్యత్ రాజకీయ వ్యూహంలో భాగంగా విజయశాంతిని తిరిగి బీజేపీ గూటికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. బీజేపీలో చేరికపై విజయశాంతి ఇంతవరకు ఎలాంటి ప్రక్కన చేయకపోయినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీలోని గ్రూపులు, వాటి మధ్య వాడి వీడి వాదోపవాదాలు.. నచ్చని విజయశాంతి బీజేపీ గూటికి చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

దీంతో ఏకకాలంలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు ప్రముఖ నేతలు పార్టీని వీడడం దాదాపుగా ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీనీ వీడడంతో ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ బక్కచిక్కినట్లు అయింది. దీనిని నుంచి ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ కోలుకుంటున్న సమయంలో ఆ పార్టీ నేతలు మళ్ళీ జంప్ చేసేందుకు సిద్దమవుతున్నారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తిరిగి మొదటికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్‌ను ప్రస్తుతం అజార్, విజయశాంతిలు కూడా వీడితే పరిస్థితి మరింత అధ్వానంగా మారడం తథ్యంగా తెలుస్తోంది. దీని ప్రభావం హుజూర్‌నగర్ ఉపఎన్నికపై కూడా పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.