Breaking News
  • నిజామాబాద్‌లో హైఅలర్ట్. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో నిన్న ఒక్క రోజే 26 కేసులు. పాజిటివ్‌ వచ్చినవారి బంధువులను గుర్తించే పనిలో అధికారులు.
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 కేసులు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం. కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో 144 సెక్షన్‌. పాజిటివ్‌ ప్రాంతాల్లోని వాసులకు హోంక్వారంటైన్‌. రక్త నమూనాల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ.
  • గుజరాత్: సురేంద్రనగర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి, మరొకరికి గాయాలు. హైదరాబాద్-70, వరంగల్‌ అర్బన్-19, కరీంనగర్-17 కేసులు. మేడ్చల్-15, రంగారెడ్డి-16, నిజామాబాద్-16, నల్గొండ-9. కామారెడ్డి-8, మహబూబ్‌నగర్-7, గద్వాల-6, సంగారెడ్డి-6. మెదక్-4, భద్రాద్రి-కొత్తగూడెం-4 కేసులు. ములుగు-2, భూపాలపల్లి-1, జనగామ-1 కేసులు నమోదు.
  • రాజస్థాన్: ఈరోజు కొత్తగా 12 పాజిటివ్‌ కేసులు నమోదు. మొత్తం 191 కేసులు నమోదు.
  • ఏపీ, తెలంగాణలో రేషన్‌ పరేషాన్. రేషన్‌ షాప్‌ల దగ్గర భారీగా క్యూ కట్టిన జనం. మెజారిటీ షాప్‌ల దగ్గర కనిపంచిన భౌతికదూరం నిబంధన. పంపిణీలో జాప్యంపై నిర్వాహకులతో జనం ఘర్షణ. రంగంలోకి దిగిన పోలీసులు. రేషన్‌ షాప్‌ల దగ్గర భౌతిక దూరం పాటించేలా చర్యలు. కార్డు దారులందరికీ ఉచిత బియ్యం అందిస్తామంటున్న అధికారులు.

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నియామకం.. విజయసాయి రెడ్డికి కీలక పదవి..

Vijaya Sai Reddy Appointed As Parliamentary Standing Committee chairman, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నియామకం.. విజయసాయి రెడ్డికి కీలక పదవి..

పార్లమెంటరీ స్థాయి సంఘాలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. వివిధ శాఖలకు ఛైర్మన్లు, సభ్యులను నియమించినట్లు లోక్‌సభ సచివాలయం వెల్లడించింది.
ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల ఎంపీలకు కూడా ఛైర్మన్‌ పదవులు దక్కాయి. కాగా, ముఖ్యంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కీలక పదవి దక్కింది. వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్‌గా విజయసాయిరెడ్డిని నియమించారు. ఈ కమిటీలో మాగుంట శ్రీనివాసులురెడ్డి, నామా, కేశినేని నానిని సభ్యులుగా ఉన్నారు. ఇక పరిశ్రమల వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎంపీ కేశవరావును నియమించారు. పరిశ్రమల వ్యవహారాల పార్లమెంటరీ సభ్యుడిగా అవినాష్ రెడ్డిని నియమిస్తున్నట్లు ఓం బిర్లా తెలిపారు. ఇదిలా ఉంటే.. రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖల స్థాయి సంఘం చైర్మన్‌గా టీజీ, పార్లమెంట్ వ్యవహారాల ఆర్థికశాఖ సభ్యులుగా మిథున్‌రెడ్డి, సీఎం రమేష్‌ను నియమిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు ఢిల్లీలో కీలక పదవులు వరించడం విశేషం.

ఇక పెట్రోలియం స్థాయి సంఘం ఛైర్మన్‌గా బీజేపీ ఎంపీ రమేశ్ బిధురి, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ స్థాయి సంఘానికి ఛైర్మన్‌గా కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ను నియమించారు. హోం వ్యవహారాల స్థాయి సంఘం ఛైర్మన్‌గా కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ, రక్షణ వ్యవహారాల స్థాయి సంఘం ఛైర్మన్‌గా బీజేపీ నేత జోయల్‌ ఓరం, విదేశీ వ్యవహారాల స్థాయి సంఘం ఛైర్మన్‌గా బీజేపీ సీనియర్‌ నేత పి.పి చౌదరి, అందులో సభ్యుడిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం నియమితులయ్యారు. గతంలో చిదంబరం హోం వ్యవహారాల స్థాయి సంఘం ఛైర్మన్‌గా వ్యవహరించారు. రైల్వే వ్యవహారాల స్థాయి సంఘానికి రాధామోహన్‌ సింగ్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఎరువులు, రసాయనాల స్థాయి సంఘం ఛైర్మన్‌గా డీఎంకే ఎంపీ కనిమొళి నియమితులయ్యారు. స్థాయి సంఘంలో కాంగ్రెస్ నేతలు రాహుల్‌ గాంధీ, అభిషేక్‌ మనుసింఘ్వి సభ్యులుగా ఉన్నారు.

Related Tags