Breaking News
  • రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దులు తప్పనిసరిగా మూసివేయాలన్న కేంద్రం. సరుకు రవాణా మినహా ఎలాంటి రవాణాకు అనుమతి నిరాకరణ. కలెక్టర్లు, ఎస్పీలే బాధ్యత వహించాలన్న కేంద్రం. వలస కూలీలకు 14 రోజుల క్వారంటైన్‌. అద్దె డిమాండ్‌ చేసే ఇంటి యజమానులపై కఠిన చర్యలు. లాక్‌డౌన్‌ను మరింత కఠినం చేయాలని కేంద్రం ఆదేశాలు.
  • ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌. ప్రపంచవ్యాప్తంగా 7 లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు. 7,21,412కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య. ఇప్పటివరకు కోలుకున్న 1,51,004 మంది. ప్రపంచ వ్యాప్తంగా 33,956 మంది మృతి. స్పెయిన్‌లో నిన్న ఒక్కరోజే 838 మంది మృతి. నిన్న ఇటలీలో 756 మంది, ఫ్రాన్స్‌లో 292 మంది మృతి. నిన్న అమెరికాలో 237 మంది, బ్రిటన్‌లో 209 మంది మృతి. నిన్న ఒక్కరోజే అమెరికాలో కొత్తగా 17,600 కేసులు నమోదు. అమెరికాలో 1,41,812 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు. ఇటలీలో లక్షకు చేరువలో కరోనా బాధితుల సంఖ్య. చైనా-3,300, ఇరాన్‌-2,640, ఫ్రాన్స్‌-2,606 మంది మృతి. అమెరికా-2,475, ఇంగ్లాండ్‌-1,228 మంది మృతి.
  • కరోనాపై పోరుకు ఏపీ ఐఏఎస్‌ అధికారుల ఆర్థిక చేయూత. మూడు రోజుల జీతాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇవ్వాలని.. ఐఏఎస్‌ అధికారుల సంఘం నిర్ణయం.
  • ఛత్తీస్‌గఢ్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శైలేష్‌ పాండేపై కేసు నమోదు. బిలాస్‌పూర్‌లో 144 సెక్షన్‌ ఉల్లంఘించారని ఎమ్మెల్యేపై కేసు నమోదు.
  • ఢిల్లీ ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్‌ అధికారుల సస్పెన్షన్‌. మరో ఇద్దరు అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన కేంద్రహోంశాఖ. కరోనా నివారణపై నిర్లక్ష్యం వహించినందుకు కేంద్రం చర్యలు.

Vijaya dairy: మళ్లీ పెరిగిన ‘విజయ’ పాల ధరలు.. రెండు నెలల్లోనే 2 సార్లు

Vijaya dairy, Vijaya dairy: మళ్లీ పెరిగిన ‘విజయ’ పాల ధరలు.. రెండు నెలల్లోనే 2 సార్లు

Vijaya dairy: విజయ పాల ధరలు మళ్ళీ పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో విజయ పాల ధరలను మళ్లీ పెంచారు. రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ రెండు నెలల క్రితమే లీటరు ధరను రూ.2 పెంచింది. మళ్లీ ఇప్పుడు రూ.3 పెంచడం గమనార్హం. తాజా పెంపుతో విజయ పాల ధర లీటరు రూ.47 అయింది. 2 నెలల వ్యవధిలోనే లీటరుకు రూ.5 పెంచడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ప్రైవేటు డెయిరీలకు, విజయ పాలకు కేవలం రూ.1 మాత్రమే తేడా ఉండడంతో విజయ పాల మార్కెట్‌ దెబ్బతినే అవకాశం లేదంటున్నారు.

కాగా.. టోన్డ్‌ పాలు లీటరుకు రూ.47, హోల్‌ మిల్క్‌ లీటరుకు రూ.61, డైట్‌ మిల్క్‌ లీటరు రూ.41, స్టాండర్డైజ్‌ పాలు రూ.51, ఆవుపాలు రూ.47, టీ స్పెషల్‌ మిల్క్‌ రూ.45 చొప్పున ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రైవేటు డెయిరీలు జనవరిలోనే పాల ధరలు పెంచేశాయి. ప్రస్తుతం విజయ పాల ధర లీటరు రూ.47 అయింది. ప్రస్తుతం ధరల పెరుగుదలతో ప్రైవేటు డెయిరీలకు, విజయ డెయిరీకి ఉన్న తేడా తగ్గిపోయింది.

విజయ డెయిరీ పాల ఉత్పత్తుల అమ్మకాలు గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టాయి. పాడి రైతులకు ధర పెంచడానికే వినియోగదారులపైనా భారం వేయాల్సి వచ్చిందని డెయిరీ ఫెడరేషన్‌ వెల్లడించింది. పెరిగిన ధరలు ఆదివారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఇతర డెయిరీల పాలు 36 లక్షల లీటర్లు అమ్ముడుపోతున్నాయి. ధరలు పెంచిన నేపథ్యంలో రెండు నెలల క్రితం రోజుకు 3.12 లక్షల లీటర్ల పాలు అమ్ముడు పోయేవి. మిగతా సంస్థలతో పోలిస్తే లీటరుకు రూ.4 తక్కువ ఉండడంతో వినియోగదారులు కొనేవారు. ప్రస్తుతం 2.50 లక్షల లీటర్ల పాల విక్రయాలు మాత్రమే జరుగుతున్నట్లు సమాచారం.

Related Tags