Breaking News
  • నెల్లూరు: సైదాపురం తహశీల్దార్‌ చంద్రశేఖర్‌ సస్పెన్షన్‌. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో చంద్రశేఖర్‌తో పాటు.. వీఆర్‌వోతో, తహశీల్దార్‌ ఆఫీస్‌ ఉద్యోగిని సస్పెండ్‌ చేసిన కలెక్టర్‌.
  • టీవీ9కు అవార్డుల పంట. ఎక్సేంజ్‌ ఫర్‌ మీడియా న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ అవార్డుల్లో.. టీవీ9కు మూడు అవార్డులు. పుల్వామా దాడి కవరేజ్‌కు బెస్ట్ న్యూస్ కవరేజ్ అవార్డు అందుకున్న.. విజయవాడ బ్యూరో చీఫ్‌ హసీనా. మరో రెండు విభాగాల్లో టీవీ9కు అవార్డులు. బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ కార్యక్రమానికి.. సౌత్‌ ఇండియాలోనే బెస్ట్‌ యాంకర్‌గా రజినీకాంత్‌కు అవార్డు. టీవీ9 టాస్క్‌ఫోర్స్‌ బ్లాక్‌మ్యాజిక్‌ కార్యక్రమానికి మరో అవార్డు. అద్రాస్‌పల్లిలోని 'చితిపై మరో చితి' బాణామతి కథనానికి.. బెస్ట్‌ లేట్‌ ప్రైమ్‌టైం షో అవార్డు.
  • కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన కేంద్రం. స్థానికుల ప్రయోజనాలను కాపాడుతామని హామీ. త్వరలో ప్రత్యేక హోదా స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తాం -కేంద్రమంత్రి జితేందర్‌సింగ్‌.
  • రామానాయుడు స్టూడియోలో ప్రెషర్‌ కుక్కర్‌ సినిమా చూసిన కేటీఆర్‌. ప్రెష్‌ ఎనర్జీ, మంచి మెసేజ్‌తో సినిమా ఉంది. డాలర్‌ డ్రీమ్స్‌ కోసం అందరూ అమెరికాకు పరుగులు పెడుతున్నారు. కథలోని కంటెంట్‌ను అందరికీ అర్ధమయ్యేలా సినిమా తీశారు-మంత్రి కేటీఆర్‌.
  • తూ.గో: కోటనందూరు మండలం అప్పలరాజుపేటలో విద్యుత్‌షాక్‌తో మామిడి శ్రీను అనే వ్యక్తి మృతి.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి ఉచిత దర్శనానికి 24 గంటల సమయం. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 56,837 మంది భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు.

విజయ్ మాల్యా అప్పగింత.. లండన్ కోర్టు ఏం చెబుతుందో ?

, విజయ్ మాల్యా అప్పగింత.. లండన్ కోర్టు ఏం చెబుతుందో ?

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను ఇండియాకు అప్పగించే విషయమై లండన్ కోర్టు మంగళవారం తీర్పునివ్వనుంది. తన అప్పగింతను సవాలు చేస్తూ అప్పీలు చేసుకునేందుకు ఆయన కోర్టు అనుమతిని కోరారు. మాల్యాను ఇండియాకు అప్పగించాలంటూ యుకె హోమ్ సెక్రటరీ సాజిద్ జావీద్ తన సంతకంతో ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని మాల్యా సవాలు చేశారు. ఇండియాలో బ్యాంకులకు రూ. 9 వేల కోట్ల రూపాయల మేర రుణాలను ఎగవేసి విదేశాలకు పరారైన మాల్యా కేసు..లండన్ కోర్టులో వాయిదాల పర్వంలో నలుగుతోంది. ఆయన లీవ్ అప్పీలుపై లండన్ కోర్టు రాతపూర్వకంగా ఇదివరకే తిరస్కరిస్తూ ఉత్తర్వులిచ్చింది. అయితే తిరిగి దాఖలు చేసుకోవచ్చునని పేర్కొనడంతో మౌఖిక విచారణకు కోర్టు ఆదేశించింది.
అక్కడి రాయల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ కోర్టులో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై తీర్పునివ్వనుంది. జడ్జీలు జార్జ్ లెగాట్, ఏండ్రు పాపుల్ నెల్ తో కూడిన బెంచ్ ఈ కేసును విచారిస్తోంది. మాల్యా లీగల్ టీమ్, భారత ప్రభుత్వం తరఫున క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ వాదనలతో కోర్టు హాలు వేడెక్కుతోంది. మాల్యాను భారత్ కు అప్పగించాలని కోర్టు ఆదేశించిన పక్షంలో ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లోని ఓ సెల్ ను రెడీగా ఉంచారు. అయితే ఈ కేసులో తమ తీర్పును జడ్జీలు రిజర్వ్ లో ఉంచి.. రానున్న వారాల్లో లిఖితపూర్వకంగా రూలింగ్ ఇవ్వవచ్ఛునని కూడా అంటున్నారు. మాల్యా అప్పీలును కోర్టు తిరస్కరించిన పక్షంలో ఆయనను 28 రోజుల్లో భారత్ కు అప్పగించాల్సి ఉంటుంది. కానీ అప్పీలు చేసుకోవడానికి కోర్టు అనుమతిస్తే.. కేసు మళ్ళీ పూర్తి స్థాయి విచారణకు వస్తుంది. అప్పీళ్ల ప్రక్రియలో ఈ తాజా అప్పీలు తుది దశలో ఉందన్నది న్యాయ నిపుణుల అభిప్రాయం.హైకోర్టు దశలో ఇదివరకే అనుమతిని నిరాకరించిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టులో అప్పీలుకు పర్మిషన్ ఇచ్ఛే అవకాశాలు తక్కువేనంటున్నారు. ఈ రకమైన ‘ అప్పగింత ‘ కేసుల్లో సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలుకు అనుమతి లభించడమన్నది అరుదైన విషయమని అంటున్నారు. చివరిగా… మాల్యా ఫ్రాన్స్ లోని స్ట్రాస్ బర్గ్ లో గల యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ లో అప్పీలు దాఖలు చేసుకోవలసి ఉంటుంది. కానీ… ఈ విధమైన కేసుల్లో ఈ కోర్టు జోక్యం చేసుకునే ఛాన్స్ లేదని అంటున్నారు.

Related Tags