ఎప్పుడైనా నేను యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పొచ్చు

‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి విజయాలతో టాలీవుడ్‌లో సెన్సేషనల్ హీరోగా వెలుగొందుతున్నాడు విజయ్ దేవరకొండ. ఈ హీరోతో సినిమాలు తీయాలని ఇప్పుడు పెద్ద పెద్ద దర్శకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో తాను ఎప్పుడైనా నటనకు స్వస్తి చెప్పుచ్చని సంచలన వ్యాఖ్యలు చేశాడు విజయ్ దేవరకొండ. తాను నటించిన ‘డియర్ కామ్రేడ్’ ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘‘నేను ఎప్పుడైనా యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పొచ్చు. సినిమాలకు మించి ఆసక్తికరంగా ఏదన్నా […]

ఎప్పుడైనా నేను యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పొచ్చు
Follow us

| Edited By:

Updated on: Jul 25, 2019 | 12:18 PM

‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి విజయాలతో టాలీవుడ్‌లో సెన్సేషనల్ హీరోగా వెలుగొందుతున్నాడు విజయ్ దేవరకొండ. ఈ హీరోతో సినిమాలు తీయాలని ఇప్పుడు పెద్ద పెద్ద దర్శకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో తాను ఎప్పుడైనా నటనకు స్వస్తి చెప్పుచ్చని సంచలన వ్యాఖ్యలు చేశాడు విజయ్ దేవరకొండ. తాను నటించిన ‘డియర్ కామ్రేడ్’ ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించాడు.

‘‘నేను ఎప్పుడైనా యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పొచ్చు. సినిమాలకు మించి ఆసక్తికరంగా ఏదన్నా చేయాలనిపించినా.. చేసిందే చేస్తున్నామనిపించి బోర్ కొట్టినా వెంటనే యాక్టింగ్‌ మానేస్తా’’ అని విజయ్ తెలిపాడు. ఇక పెళ్లెప్పుడు చేసుకుంటారన్న మరో ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘35ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. అందుకు మరో ఐదేళ్లు ఆగాలి’’ అని చెప్పుకొచ్చాడు.

కాగా డియర్ కామ్రేడ్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక రెండోసారి జోడీ కట్టింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.