దేవరకొండ ‘హీరో’ మూవీ ఆగిపోయిందా? రీజన్స్ ఏంటి?

హైదరాబాద్‌:  టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్‌ దేవరకొండ నటించిన తాజా మూవీ ‘డియర్ కామ్రేడ్’ మూవీ మిక్డ్స్ టాక్ అందుకుంది. మరోవైపు విజయ్ నటిస్తున్న ‘హీరో’ సినిమా షూటింగ్ ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై కాంబినేషన్‌లో ప్రారంభమైన సినిమా ఇది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. మాళవికా మోహన్‌ హీరోయిన్‌గా చేస్తోంది. చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్‌ మొదలైంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల […]

దేవరకొండ 'హీరో' మూవీ ఆగిపోయిందా? రీజన్స్ ఏంటి?
Follow us

|

Updated on: Jul 27, 2019 | 4:16 PM

హైదరాబాద్‌:  టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్‌ దేవరకొండ నటించిన తాజా మూవీ ‘డియర్ కామ్రేడ్’ మూవీ మిక్డ్స్ టాక్ అందుకుంది. మరోవైపు విజయ్ నటిస్తున్న ‘హీరో’ సినిమా షూటింగ్ ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై కాంబినేషన్‌లో ప్రారంభమైన సినిమా ఇది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. మాళవికా మోహన్‌ హీరోయిన్‌గా చేస్తోంది. చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్‌ మొదలైంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. దీనిలో విజయ్‌ బైకర్‌గా సందడి చేయనున్నట్లు తెలిసింది.

అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్‌ ఆగిపోయినట్లు సమాచారం. స్క్రిప్టు విషయంలో విజయ్‌, ఆనంద్‌కు క్రియేటీవ్ డిఫరెన్సెస్ రావడంతో చిత్రీకరణను ఆపినట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్‌ సలహాలు తీసుకోవడం ఆనంద్‌కు నచ్చలేదని కూడా చెబుతున్నారు. అంతేకాదు మైత్రి మూవీ మేకర్స్‌ కూడా అవుట్‌పుట్‌ విషయంలో సంతృప్తికరంగా లేరట. అందుకే ఇప్పటి వరకు రూ.15 కోట్లు ఖర్చు చేసినప్పటికీ రాజీపడకూడదని చిత్రీకరణను ఆపినట్లు తెలుస్తోంది. మరి ఈ రూమర్స్‌లో ఏమాత్రం నిజం ఉందో తెలియాలంటే.. విజయ్‌, మైత్రి సంస్థ స్పందించాల్సిందే.