World Famous Lover: విజయ్‌ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్‌ లవర్‌’ రివ్యూ

World Famous Lover : సినిమా: వరల్డ్ ఫేమస్‌ లవర్‌ నిర్మాణ సంస్థ: క్రియేటివ్‌ కమర్షియల్స్ దర్శకత్వం: క్రాంతి మాధవ్‌ నిర్మాత: కె.ఎ.వల్లభ, కె.ఎస్‌.రామారావు, కథ, స్క్రీన్‌ప్లే: క్రాంతి మాధవ్‌ నటీనటులు: విజయ్‌ దేవరకొండ, రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌ ట్రెసా, ఇజబెల్లె లెట్‌, ప్రియదర్శి, జయప్రకాష్‌ తదితరులు సంగీతం: గోపీ సుందర్‌ కెమెరా: జయకృష్ణ గుమ్మడి ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు విడుదల: 14.02.2020 ఫిబ్రవరి 14 అంటేనే ప్రేమికులకు పండగ. అందుకే ప్రేమికులకు గిఫ్ట్ […]

World Famous Lover: విజయ్‌ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్‌ లవర్‌' రివ్యూ
Follow us

|

Updated on: Feb 14, 2020 | 4:12 PM

World Famous Lover : సినిమా: వరల్డ్ ఫేమస్‌ లవర్‌ నిర్మాణ సంస్థ: క్రియేటివ్‌ కమర్షియల్స్ దర్శకత్వం: క్రాంతి మాధవ్‌ నిర్మాత: కె.ఎ.వల్లభ, కె.ఎస్‌.రామారావు, కథ, స్క్రీన్‌ప్లే: క్రాంతి మాధవ్‌ నటీనటులు: విజయ్‌ దేవరకొండ, రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌ ట్రెసా, ఇజబెల్లె లెట్‌, ప్రియదర్శి, జయప్రకాష్‌ తదితరులు సంగీతం: గోపీ సుందర్‌ కెమెరా: జయకృష్ణ గుమ్మడి ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు విడుదల: 14.02.2020 ఫిబ్రవరి 14 అంటేనే ప్రేమికులకు పండగ. అందుకే ప్రేమికులకు గిఫ్ట్ అంటూ ఈ ఫ్రైడే విజయ్‌ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్‌ లవర్‌’తో పలకరించారు. అంతే కాదు.. ఆ మధ్య ఇదే నా లాస్ట్ లవ్‌ స్టోరీ అంటూ ఓ ఇంట్రస్టింగ్‌ ఝలక్‌ ఇచ్చారు విజయ్‌. మరి ఫక్తు లవ్‌ స్టోరీలకు దూరమవుతున్న ఈ రౌడీ హీరో సినిమా లేటెస్ట్ గా ఎలాంటి బజ్‌ క్రియేట్‌ చేసిందో చూడాలి. కథ యామిని (రాశీ ఖన్నా) బాగా చదువుకుని జీవితంలో స్థిరపడి ఉంటుంది. గౌతమ్‌ (విజయ్‌ దేవరకొండ) తో లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌లో ఉంటుంది. మొదట్లో అంతా బాగానే ఉన్నట్టు అనిపించినా, రోజులు గడిచే కొద్దీ ఆమె డిప్రషన్‌కు గురవుతూ ఉంటుంది. అందుకు కారణం గౌతమ్‌. లక్షణంగా ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి రచయితగా స్థిరపడతానంటూ ఇంట్లో ఉంటాడు. యామిని సంపాదన మీద ఆధారపడతాడు. పోనీ ఆ ఏడాదిలో అతను రచించింది కూడా ఏమీ ఉండదు. అలాంటి సందర్భంలో అతన్నుంచి దూరం జరగాలని నిర్ణయించుకుంటుంది యామిని. ఆమె దూరమయ్యాక అతను శీనయ్య పాత్రకు దగ్గరవుతాడు. ఖమ్మం ఇల్లందు బొగ్గు గనుల్లో సువర్ణ మానసిక స్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అలాగే ఫ్రాన్స్ లో ఇసా (ఇసబెల్లె)తో చట్టాపట్టాలేసుకుని తిరుగుతాడు. అదంతా ఎలా సాధ్యమైంది? గౌతమ్‌కీ… శీనయ్యకు, అతనికీ… ఫ్రాన్స్ వెళ్లిన ఎంప్లాయికి ఏంటి సంబంధం? వారందరితోనూ అతనెలా మింగిల్‌ అయ్యాడు? యామిని దూరం అయ్యాక గౌతమ్‌ పరిస్థితి ఏంటి? గౌతమ్‌ దృష్టిలో వరల్డ్ ఫేమస్‌ లవర్‌ ఎవరు? ప్రేమంటే త్యాగం అని ఎప్పుడు నమ్ముతాడు? దైవత్వం అని ఎప్పుడు గుర్తిస్తాడు? అసలు గౌతమ్‌ జీవితంలో ఆఖరికి ఏం జరిగింది?జైలుకు ఎందుకు వెళ్లాడు? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు. ప్లస్‌ పాయింట్లు – విజయ్‌ దేవరకొండ హెయిర్‌ స్టైల్స్, లుక్స్ – విజయ్‌ నటన – ఐశ్వర్య రాజేష్‌ – ఇల్లందు ఎపిసోడ్‌ – కెమెరా మైనస్‌ పాయింట్లు – ముందే తెలిసిపోయే కథనం – వాస్తవానికి, రచనలకు సరైన లింకు కుదరకపోవడం – సెకండాఫ్‌ సమీక్ష వరల్డ్ ఫేమస్‌ లవర్‌ అని విజయ్‌ ఏ ముహూర్తాన అనౌన్స్ చేశారో కానీ, ఈ సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగాయి. దానికి తోడు నలుగురు హీరోయిన్లు అనేసరికి ఇంకాస్త ఇంట్రస్ట్ ఎక్కువైంది. మూడు నేపథ్యాలు కొత్తగా ఉండటం, నలుగురు హీరోయిన్లో సీన్స్ మిక్స్ చేయడం ఎలా జరుగుతుందనే ఇంట్రస్ట్ ని క్రియేట్‌ చేసింది. ఏ పాత్రకు ఆ పాత్రలో విజయ్‌ చాలా బాగా నటించారు. ఇల్లందులో శీనుగా, యామిని దగ్గర గౌతమ్‌గా, ప్యారిస్‌లో లవర్‌గా మెప్పించారు. హెయిర్‌ స్టైల్‌, వాయిస్‌ మాడ్యులేషన్‌ చాలా బావుంది. సువర్ణ కేరక్టర్‌లో ఐశ్వర్య రాజేష్‌ను చూస్తున్నంత సేపూ మనపక్కింట్లో అమ్మాయిని చూస్తున్నట్టుగానే అనిపించింది. డిప్రెషన్‌లోకి వెళ్లిన అమ్మాయిగా రాశీ బాగానే చేసింది. డిప్రెషన్‌లోకి రావడానికి ముందు, లవ్‌లో ఉన్న సన్నివేశాల్లోనూ దిగులు ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటో అర్థం కాదు. దర్శి ఇందులో కనిపించినా నవ్వులు ఉండవు. హీరోని సపోర్ట్ చేసే రోల్‌ చేశారు. శీనయ్యకు, అతని తండ్రికి మధ్య జరిగే సంభాషణ బావుంటుంది. క్యాథరిన్‌ కేరక్టర్‌కు పెద్దగా నటించే స్కోప్‌ దక్కలేదు. కనిపించినంత సేపూ గ్లామరస్‌గా ఉంది స్క్రీన్‌ మీద. సినిమా కాస్త ఫాస్ట్ గా మూవ్‌ అయింది, సినిమాకు పెద్ద ప్లస్‌ పాయింట్ కూడా ఇల్లందు ఎపిసోడే. లొకేషన్లు బావున్నాయి. పాటలు సన్నివేశాల్లో కలిసిపోయాయి. కాస్ట్యూమ్స్ నేచురల్‌గా ఉన్నాయి. కెమెరా బావుంది. ఎడిటింగ్‌ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సిందేమో. టోటల్‌ కథను ముందే రివీల్‌ చేయకుండా, సస్పెన్స్ పాటిస్తే ఇంకా ప్లస్‌ అయి ఉండేది. స్క్రీన్‌ప్లే మీద ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. వ్యక్తుల్ని అర్థం చేసుకునే తీరు వల్ల ప్రేమ రెట్టింపవుతుంది.. ఒకరికి ఒకరు అర్థం కాకపోవడం వల్లనే విడిపోవడాలు ఎక్కువంటాయని గట్టిగా చెప్పిన కథ. ప్రేమంటే శాక్రిఫైస్‌, ప్రేమంటే దైవత్వం అని చెప్పే ప్రయత్నం చేశారు డైరక్టర్‌. ఫైనల్‌గా… ఒక రచయిత… మూడు కథలు! – డా. చల్లా భాగ్యలక్ష్మి