‘లిప్‌లాక్‌’లపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ లిప్‌లాక్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘డియర్ కామ్రేడ్’ చిత్రం తమిళ ఆడియో ఆవిష్కరణ ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా లిప్‌లాక్‌లపై మీడియా అడిగిన ప్రశ్నలకు విజయ్ దేవరకొండ కొంత ఉద్వేగంగా మాట్లాడారు. సినిమాల్లో లిప్ లాక్‌లు చేస్తే చూసేవారికి రొమాంటిక్‌గా, వినోదంగా ఉంటుందని.. కానీ ఆయా సన్నివేశాల్లో నటించే తమ జీవితాలపై దాని ప్రభావం సీరియస్‌గా ఉంటుందని పేర్కొన్నారు. లిప్‌లాక్‌లను చూసి కొంతమంది చాలా ఈజీగా కామెంట్ చేస్తారని.. అంతేకాదు సినిమా చూసి ఆయా క్యారెక్టర్లను ‘వీళ్లు ఇంతే అనటం’ ఎంత బాధగా ఉంటుందో తమకు తెలుసని భావోద్వేగానికి గురయ్యారు. అయితే సినిమా విడుదల తర్వాత.. దాని విజయంలో తమకు విముక్తి దొరుకుతుందని తెలిపారు.

లిప్‌లాక్ ఒక్కటే సినిమా కాదని.. ఒక మూవీ అంటే అందులోనే అందరి భవిష్యత్తు, నిర్మాత డబ్బులు, దర్శకుడి జీవితం, కొత్త అర్టిస్తులకు వాళ్లు నిరూపించుకునే ప్లాట్ పామ్, ఏదో సాధించాలనే తపనతో వచ్చి నిలదొక్కుకునే ప్రయత్నమని.. కానీ ఆటలాడుకునే విషయం కాదని అన్నారు. డియర్ కామ్రేడ్ లిప్ లాక్ సినిమా కాదని చెప్పుకొచ్చారు. ఇక తాను హైదరాబాద్ లో చదువుకుంటున్నప్పుడు పక్కా హైదరాబాదీ యాస అలవాటైందని.. కెరీర్ ప్రారంభంలో అదే యాసలోనే మాట్లాడటంతో సక్సెస్ అవ్వడంతో.. మిగిలిన చిత్రాల్లో కూడా అదే యాసనే కొనసాగిస్తున్నానని విజయ్ దేవరకొండ చెప్పారు.

కాగా విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న నటించింది. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *