రౌడీ కెరీర్ లోనే కొత్తగా..!

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన తన తాజా చిత్రం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఫేమ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ సింగరేణి కార్మికులకు లీడర్ గా కనిపిస్తున్నాడు. అలాగే మరో వైపు 8 సంవత్సరాల అబ్బాయికి తండ్రిగా కూడా కనిపిస్తాడట. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ హీరోయిన్లుగా […]

రౌడీ కెరీర్ లోనే కొత్తగా..!
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 7:55 AM

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన తన తాజా చిత్రం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఫేమ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ సింగరేణి కార్మికులకు లీడర్ గా కనిపిస్తున్నాడు. అలాగే మరో వైపు 8 సంవత్సరాల అబ్బాయికి తండ్రిగా కూడా కనిపిస్తాడట. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కె.ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

విజయ్ దేవరకొండ ఈ సినిమాతో పాటు ‘డియర్ కామ్రేడ్’ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో రష్మిక మందన్నా హీరోయిన్.