రౌడీ హీరో ఫ్యాన్స్‌కు పిచ్చేక్కించే రేంజ్‌లో యాక్షన్ సీక్వెన్స్‌, బ్యాంకాక్‌లో ప్లాన్ చేసిన పూరి జగన్నాథ్

షూటింగ్‌లు స్టార్ట్ అయ్యాయి.. థియేటర్లు కూడా తెరుచుకున్నాయి. 'ఫైటర్' మాత్రం సెట్‌కు రావటం లేదు.. ఎందుకు.. అసలు ఎప్పుడొస్తారు..? వస్తారా లేదా..?

రౌడీ హీరో ఫ్యాన్స్‌కు పిచ్చేక్కించే రేంజ్‌లో యాక్షన్ సీక్వెన్స్‌,  బ్యాంకాక్‌లో ప్లాన్ చేసిన పూరి జగన్నాథ్
Follow us

|

Updated on: Dec 05, 2020 | 11:14 AM

షూటింగ్‌లు స్టార్ట్ అయ్యాయి.. థియేటర్లు కూడా తెరుచుకున్నాయి. ‘ఫైటర్’ మాత్రం సెట్‌కు రావటం లేదు.. ఎందుకు.. అసలు ఎప్పుడొస్తారు..? వస్తారా లేదా..? ఫిల్మ్ సర్కిల్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే అనుమానాలు. అయితే ఈ ప్రశ్నలపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఇన్ని రోజులు టైం పాస్ చేసిన ‘ఫైటర్’ ఇక సెట్టుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. సంక్రాంతి తరువాత ఫైటర్‌ షూటింగ్ మొదలవుతుందట. లాక్‌ డౌన్‌ తరువాత కూడా లాంగ్‌ బ్రేక్‌ తీసుకున్న రౌడీ హీరోతో.. షూటింగ్ రీస్టార్ట్‌ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు డేరింగ్ అండ్ డాషింగ్ పూరీ జగన్నాథ్‌. ఫారిన్‌ షెడ్యూల్‌ కావటంతో ఇన్నాళ్లుగా షూటింగ్ వాయిదా వేస్తున్న ఫైటర్ టీం ఫైనల్‌గా షూటింగ్ పున: ప్రారంభం చేయనుంది.

ఫైటర్ సినిమా  ఎనౌన్స్‌మెంట్ వచ్చిన దగ్గర నుంచి అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.  కానీ ఫస్ట్ షెడ్యూల్‌ తరువాత షూటింగ్‌ బ్రేక్ పడింది.. ప్రీవియస్‌ ఎక్స్‌పీరియన్స్‌తో ఫైటర్‌ విషయంలో ఆచితూచి అడుగులేశారు పూరీ.. అసలే అప్పటి దాకా నెమ్మదిగా సాగిన షూటింగ్‌కు కోవిడ్‌.. కంప్లీట్‌గా బ్రేక్ వేసింది. ఎనిమిది నెలలుగా ఫైటర్‌ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. లాక్‌ డౌన్‌ అనంతరం అన్ని సినిమాల షూటింగ్స్ మొదలవుతున్నా.. ఫైటర్ మాత్రం సెట్స్ కు రాలేదు. విజయ్‌ ప్రైవేట్‌ ఫంక్షన్స్‌లో కనిపిస్తున్నా.. కెమెరా ముందుకు రాలేదు.. పూరీ కూడా ఆ ప్రయత్నం చేసినట్టుగా కనిపించలేదు. లాంగ్ బ్రేక్‌ తరువాత ఫైటర్‌ రీస్టార్ట్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది టీం. సంక్రాంతి తరువాత ఫారిన్‌ షెడ్యూల్‌ ప్లాన్ చేశారు. పూరీ ఫేవరెట్‌ లొకేషన్‌ బ్యాంకాక్‌లో యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేస్తున్నారు. అక్కడి లోకల్‌ స్టంట్‌మెన్‌తో తలపడేందుకు విజయ్‌ కూడా రెడీ అన్నారు. ఈ సినిమాలో ఓ డాన్‌ కొడుకుగా నటిస్తున్నారు విజయ్ దేవరకొండ‌. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే రౌడీతో జోడీ కడుతున్నారు.

Also Read :

Concussion Substitute : కంకషన్​ సబ్​స్టిట్యూట్​ అంటే ఏంటి? దాని కోసం రూపొందించిన నియమాలు ఏంటి?

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇంట తీవ్ర విషాదం, ఎంపీకి ప్రముఖుల పరామర్శ

డిసెంబర్​ 8న భారత్​ బంద్​, ప్రభుత్వంతో చర్చలు కొలిక్కి రాకపోవడంతో రైతు సంఘాల నిర్ణయం