వియత్నాంలో తొలి కరోనా మరణం

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్షల్లో నమోదవుతున్నాయి. అయితే కొన్ని దేశాల్లో ఈ వైరస్ అదుపులోకి వస్తోంది. అందులో వియత్నాం..

వియత్నాంలో తొలి కరోనా మరణం
Follow us

| Edited By:

Updated on: Jul 31, 2020 | 7:50 PM

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్షల్లో నమోదవుతున్నాయి. అయితే కొన్ని దేశాల్లో ఈ వైరస్ అదుపులోకి వస్తోంది. అందులో వియత్నాం కూడా ఒకటి. అక్కడ ప్రారంభం నుంచి కరోనా మహమ్మారి ప్రభావం అంతగా లేదు. అంతేకాదు.. ఇప్పటి వరకు అక్కడ కరోనా మరణాలు కూడా లేవు. అయితే తాజాగా.. తొలి కరోనా మరణం సంభవించింది. ఈ విషయాన్ని ఓ అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. వియత్నాంలోని దనన్గ్‌ ప్రాంతంలో ఓ వృద్ధుడు కరోనా బారినపడి మరణించాడు. దనన్గ్‌ ప్రాంతంలో కరోనా కేసులు నమోదవుతుండటంతో.. పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం నాడు కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఇవే అత్యధికమని అధికారులు తెలిపారు. వీటితో వియత్నాంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 509కి చేరింది.

Read More 

కాలుజారి నదిలో పడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

తైవాన్‌ మాజీ అధ్యక్షుడు ఇక లేరు

కల్తీ మద్యం కాటుకు నలుగురు మృతి

ఆఫ్ఘన్‌లో కారు బాంబు పేలుడు.. 8 మంది మృతి