నవ్వులు పూయిస్తోన్న విద్యాబాలన్ ‘టాక్‌ టుక్‌’

బాలీవుడ్ హీరోయిన్‌ విద్యాబాలన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ‘‘శాస్త్రాల ప్రకారం ప్రతి అమ్మాయిలోనూ దేవీ రూపాలు ఉంటాయి. అయితే వారిలో నుంచి ఏ సమయంలో ఏ దేవత బయటకు వస్తారన్నది మాత్రం భర్త ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది’’ అని ఎవరో చెప్పిన వాయిస్‌ను ఆమె అనుకరించింది. దీనికి టైంపాస్ కోసం టాక్ టుక్ అని కామెంట్ పెట్టింది. కాగా నవ్వులు పూయిస్తోన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దానిని లక్షన్నరకు పైగా నెటిజన్లు వీక్షించారు.

అయితే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన మిషన్ మంగళలో విద్యాబాలన్ నటించింది. ఈ చిత్రం ఆగష్టు 15న విడుదల కానుంది. మార్స్ మిషన్‌ ప్రయోగంపై ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీతో పాటు తమిళంలో అజిత్ సరసన నెర్‌కొండ పార్వై(పింక్)రీమేక్‌లో నటించింది. కోలీవుడ్‌లో ఆమెకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *