Bike Stunt – Girl friend: అమ్మాయి వెనుక కూర్చోగానే రెచ్చిపోయాడు.. కట్ చేస్తే గాల్లో.. వైరల్ అవుతున్న షాకింగ్‌ వీడియో..

అతి వేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. అంతేకాదు కొందరు బైక్స్‌తో స్టంట్స్‌ చేస్తూ ప్రమాదాల్లో పడుతుంటారు..

Bike Stunt - Girl friend: అమ్మాయి వెనుక కూర్చోగానే రెచ్చిపోయాడు.. కట్ చేస్తే గాల్లో.. వైరల్ అవుతున్న షాకింగ్‌ వీడియో..

|

Updated on: Sep 25, 2022 | 10:00 AM


అతి వేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. అంతేకాదు కొందరు బైక్స్‌తో స్టంట్స్‌ చేస్తూ ప్రమాదాల్లో పడుతుంటారు. ఇక యువకుల చేతికి బైక్‌ వచ్చిందంటే వారిని పట్టుకోవడం ఎవరివల్లా కాదు.. మరి ఆ బైక్‌పైన అమ్మాయి కూర్చుంటే… ఇంక చెప్పనక్కర్లేదు. తాజాగా.. అలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ బైక్ రైడర్‌ వెనుక అమ్మాయిని తీసుకోని వెళ్తూ.. విన్యాసాలు చేయడానికి ప్రయత్నించాడు. అయితే.. కొంచెంలో ప్రమాదం తప్పించుకున్నారు కానీ.. లేకుంటే ఇద్దరి ప్రాణాలు ప్రమాదంలో పడేవి. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియో చూసి అంతా షాకవుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. అబ్బాయి, అమ్మాయి బైక్ పైన వెళ్తున్నారు. బైక్ వేగంతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో స్పీడ్ బ్రేకర్ వచ్చింది. దీనిని బైకర్ గమనించకపోవడంతో.. ఆ కుదుపుకి ఇద్దరూ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరారు. అలా ఒక్కసారి కాదు ఏకంగా రెండుసార్లు.. యువకుడు కొంచెం ఎత్తు వరకు మాత్రమే ఎగరడంతో బైక్‌ను బ్యాలెన్స్‌ చేయగలిగాడు. ఇక యువతి దాదాపు నాలుగు అడుగుల ఎత్తు వరకు ఎగిరింది. అయితే ఆమెకూడా ఎంతో చాకచక్యంగా తిరిగి బైక్‌పైన పడింది. యువకుడిని పట్టుకోవడంతో ఆమెకు ప్రమాదం తప్పింది. ఈ షాకింగ్ వీడియో అందర్ని షాక్‌కు గురిచేస్తోంది. అతి వేగంతో బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ అమ్మాయి కిందపడిపోతే ఏమై ఉండేదంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ వీడియోను ఓయూజర్‌ ట్విట్టర్‌లో షేర్ చేసారు. కాగా మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. లక్షల్లో లైక్‌ చేశారు. దయచేసి ఇలాంటి సాహసాలు చేసి ప్రమాదాలు కొనితెచ్చువద్దంటూ కామెంట్లు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Follow us
10th ఫలితాల్లో 93.5% మార్కులు..సంతోషం పట్టలేక స్పృహ తప్పిన బాలుడు
10th ఫలితాల్లో 93.5% మార్కులు..సంతోషం పట్టలేక స్పృహ తప్పిన బాలుడు
ఎండాకాలం మీ పిల్లలకు ఈ యానిమేషన్ సినిమాలు బెస్ట్..
ఎండాకాలం మీ పిల్లలకు ఈ యానిమేషన్ సినిమాలు బెస్ట్..
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
తరచూ జలుబు చేస్తుందా..? వామ్మో.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
తరచూ జలుబు చేస్తుందా..? వామ్మో.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
భర్తపై ఆమెకు ఎంత ప్రేమో..! పతి దేవుడికి ఏకంగా గుడి కట్టేసింది..
భర్తపై ఆమెకు ఎంత ప్రేమో..! పతి దేవుడికి ఏకంగా గుడి కట్టేసింది..
మీ ఊహకు దృశ్యరూపం.. వాట్సాప్‌ ఏఐతో ఇది సాధ్యం.
మీ ఊహకు దృశ్యరూపం.. వాట్సాప్‌ ఏఐతో ఇది సాధ్యం.
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్
సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు
సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు