Technology effect: మనిషిని పోలిన మనుషులు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు.! ఎలా అంటే..? వీడియో.

మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మన పెద్దలు చెబుతుంటారు. కానీ మనం దానిని పెద్దగా విశ్వసించం.. కానీ అది నిజమేనని, ఇప్పుడు వారు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చట.

Technology effect: మనిషిని పోలిన మనుషులు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు.! ఎలా అంటే..? వీడియో.

| Edited By: Ravi Kiran

Updated on: Jan 30, 2023 | 8:15 AM


మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మన పెద్దలు చెబుతుంటారు. కానీ మనం దానిని పెద్దగా విశ్వసించం.. కానీ అది నిజమేనని, ఇప్పుడు వారు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చట. అందుకోసం ఓ వెబ్‌సైట్‌, ఓ యాప్‌ కూడా ఉన్నాయట. అదే Twinstrangers.com అనే వెబ్‌సైట్‌. ఇదే పేరుతో ఓ యాప్‌ కూడా ఉంది. ఈ వెబ్‌సైట్‌ నుంచి చాలా మంది తమను పోలిన వ్యక్తులను కలుసుకున్నారట. ఆ క్షణంలో వారి ఆనందానికి అవధులు లేవట. అలా అమెరికాలోని నార్త్‌ కరోలినాకు చెందిన అంబ్రా, టెక్సాస్‌కు చెందిన జెన్నిఫర్‌ మీట్‌ అయ్యారు. వయసు రీత్యా ఇద్దరికీ పదేళ్ల వ్యత్యాసం ఉంది. కానీ, వారి ముఖ కవళికలు మాత్రం ఆశ్చర్యంగా సేమ్‌ టు సేమ్‌ అచ్చుగుద్దినట్టే ఉన్నాయి. ఇలా తమలాంటి పోలికలతో ఉన్న వ్యక్తులను కలుసుకున్న చాలామంది వారి అనుభవాలను సోషల్‌మీడియాలో పంచుకుంటున్నారు.ఈ వెబ్‌సైట్‌లో ప్రపంచవ్యాప్తంగా కోటి మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారట. సరైన పోలికలతో ఉన్నవారిని గుర్తించాలంటే మన అసలైన రూపం ఎలా ఉంటుందో అలా ఇందులో రిజిస్టర్‌ కావాల్సి ఉంటుంది. అప్‌లోడ్ చేయాలనుకుంటున్న ఫొటోలో మన ముఖం కచ్చితంగా మధ్యలోనే ఉండి తీరాలి. సైడ్‌ లుక్‌లో ఉన్న ఫోటోలు పనిచేయవు. ముఖంపై వెంట్రుకలు పడకుండా చూసుకోవాలి. కళ్లు, ముక్కు, నోరు, చెవులు అద్దంలోలా క్లియర్‌గా కనిపించే ఫోటో అప్‌లోడ్ చేయాలి. ఆ తరువాత మీ జెండర్‌, పేరు, ఊరు, దేశం వివరాలన్నీ సబ్‌మిట్‌ చేసి, ప్రొఫైల్‌ గ్యాలరీలో మరో ఐదు రకాల ఫొటోలను అదనంగా యాడ్‌ చేయాలి. వెబ్‌సైట్‌లో కృత్రిమ మేధ సహాయంతో మీ పోలికలు ఉన్న వ్యక్తులను గుర్తించడానికి కొంత నగదు చెల్లించాలి. ఇప్పుడు మీ ప్రొఫైల్‌ ఆధారంగా అప్పటికే రిజస్టర్‌ అయిన వారి ముఖాలను పోలుస్తూ.. అందులో మీలాగే ఉన్నవారి ఫొటోలను గుర్తించి ఒక ఫోల్డర్లో పంపిస్తుంది. మీకు తగ్గ వ్యక్తి దొరికితే వారిని మై ట్విన్స్‌ ఫోల్డర్‌లోకి పంపించాలి. అప్పుడు అవతలి వ్యక్తి కూడా మీతో పరిచయం పెంచుకోవడానికి వీలుంటుంది. విభిన్న రకాల ఫొటోలు జత చేసే కొద్దీ మీ పోలికలు ఉన్న మరింత మంది వ్యక్తులను ఈ వెబ్‌సైట్‌లోని సాంకేతికత వెతికిపెడుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Follow us
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.