Viral Video: ఓ మహిళ ఓవర్ యాక్షన్.. దారి ఇవ్వనందుకు క్యాబ్‌డ్రైవర్‌ను చితక బాదింది..(వీడియో)

దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువతి రెచ్చిపోయింది. హారన్‌ కొట్టినా దారి ఇవ్వలేదని ఓ మహిళ క్యాబ్‌ డ్రైవర్‌పై విరుచుకుపడింది. ఏకంగా రోడ్డు మధ్యలో స్కూటీ ఆపి మరీ డ్రైవర్‌ చెంప చెళ్లుమనిపించింది.


దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువతి రెచ్చిపోయింది. హారన్‌ కొట్టినా దారి ఇవ్వలేదని ఓ మహిళ క్యాబ్‌ డ్రైవర్‌పై విరుచుకుపడింది. ఏకంగా రోడ్డు మధ్యలో స్కూటీ ఆపి మరీ డ్రైవర్‌ చెంప చెళ్లుమనిపించింది. అతడి కాలర్ పట్టుకుని బూతులు తిడుతూ చెడామడా కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.ఢిల్లీ నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో కస్తూరి లాల్‌ ఆనంద్‌ మార్గం కూడా ఒకటి. ఈ మార్గంలోనే ఓ మహిళ మరో మహిళతో కలిసి స్కూటీపై ప్రయాణిస్తుంది. రోడ్డు అత్యంత రద్దీగా ఉండడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు వెళ్తున్నాయి. ఇంతలో మహిళ హారన్‌ కొట్టింది. కానీ స్కూటీ ముందున్న క్యాబ్‌ డ్రైవర్‌ ఆమెను పట్టించుకోలేదు. దీంతో మహిళ రెచ్చిపోయింది. స్కూటీని రోడ్డుమీదే పార్క్‌ చేసి క్యాబ్‌ డ్రైవర్‌పై విరుచుకుపడింది. అతన్ని నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ కాలర్‌ పట్టుకొని కొట్టింది. అక్కడే ఉన్న కొందరు ఆమెను ఆపేందుకు ప్రయత్నించగా.. వారిపై కూడా గట్టిగా అరిచింది. ఈ ఘటనను అక్కడున్న కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Click on your DTH Provider to Add TV9 Telugu