Viral Video: బ్యాగ్ కొట్టేసేందుకు వచ్చిన దొంగలకు దిమ్మతిరిగే షాక్.. మహిళ తెగువ చూస్తే మెచ్చుకోవాల్సిందే..

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలో ఒక మహిళ తన బ్యాగ్‌ను దొంగల నుంచి తెలివిగా రక్షించుకుంది. అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంతో దొంగలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

Viral Video: బ్యాగ్ కొట్టేసేందుకు వచ్చిన దొంగలకు దిమ్మతిరిగే షాక్.. మహిళ తెగువ చూస్తే మెచ్చుకోవాల్సిందే..
Women Viral Video
Follow us

|

Updated on: May 22, 2022 | 7:20 PM

నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వీటిలో కొన్ని నవ్వులు కురిపిస్తే, మరికొన్ని కన్నీళ్లు తెప్పిస్తాయి. ఇంకొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నెటిజన్లకు ఈ వీడియోలు నచ్చడంతో తెగ వైరల్ అవుతుంటాయి. ఇలాంటి కోవకే చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. బ్యాగ్ కొట్టేసేందుకు దొంగలు ఎన్నో ప్లాన్స్ వేస్తుంటారు. వీరిలో కొందరు సఫలమైతే, మరికొందరు విఫలమవుతుంటారు. అయితే, ఇలాంటి వీడియోలు ఇప్పటి వరకు ఎన్నో చూసి ఉంటారు. కానీ, ప్రస్తుంత వీడియోను మాత్రం మొదటిసారి చూస్తుండొచ్చు. బ్యాగ్ కోసం వచ్చిన ఇద్దరు దొంగలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందో మహిళ. దీంతో దొంగలకు ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి ఉడాయించారు.

Also Read: Viral Video: ఇదేమి బాల్‌రా నాయనా.. మంత్రం వేసినట్టు స్టంప్స్‌నే లేపేసింది.. వైరల్ వీడియో..

అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.. ఓ మహిళ బ్యాగ్ లాక్కోవడానికి ఇద్దరు బైక్ రైడర్లు వచ్చారు. బ్యాగ్ దోచుకోవాలనే ఉద్దేశంతో ఇద్దరు వ్యక్తులు వస్తున్నారని మహిళ గ్రహించింది. ఆ మహిళ వెంటనే తన బ్యాగ్‌ని టెర్రస్‌పైకి విసిరేసింది. ఇది చూసిన దుండగులు ఒక్కసారిగి షాక్ అయ్యారు. దీంతో ఏంచేయాలో దిక్కుతోచక.. ఆమె వద్ద ఏదైనా బంగారం ఉందేమోననుకుని చూశారు. కానీ, ఆమె అక్కడి నుంచి పరిగెత్తడంతో.. చేసేందే లేక.. ఉత్త చేతులతో నిరాశగా బైక్ పై అక్కడి నుంచి పారిపోయారు. ఈ విధంగా ఆ మహిళ దోపిడీ నుంచి తనను తాను రక్షించుకుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇప్పటి వరకు 3.6 లక్షల మంది వీక్షించారు.

ఇవి కూడా చదవండి

కాగా, మహిళ బ్యాగులో నగదు, నగలు ఉండడంతో చాలా అప్రమత్తమైంది. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తన బ్యాగ్‌ని లాక్కునేందుకు వస్తున్నారని మహిళ గ్రహించింది. ఆ మహిళ వెంటనే తన తెలివిని చూపించి, తన బ్యాగ్‌ని సమీపంలోని టెర్రస్‌పై విసిరింది. విపత్కర పరిస్థితుల్లో ఎలాంటి భయం లేకుండా తెలివి చూపించిన మహిళపై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: Viral: పచ్చని పెళ్లిపందిట్లో పెళ్లికూతురు ఇచ్చిన షాక్.. ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కి అందరి మైండ్ బ్లాంక్

Prank video: క్లాస్‌ రూమ్‌లో బెంచ్‌పై బల్లి పడితే,.. ఆ అమ్మాయిల్ని చూడాలి మరీ !..ఫన్నీ సీన్‌ వైరల్‌