సోషల్ మీడియాలో తరచుగా ఆశ్చర్యకరమైన వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా ఓ షాకింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. UKలోని వేల్స్లో జరిగిన ఈ వార్త మొత్తం ప్రపంచాన్ని కదిలించింది. జీవితాంతం ఆనందంగా కలిసి బ్రతకాలని కొద్ది రోజుల క్రితం పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు అకస్మాత్తుగా మరణించారు. 33 ఏళ్ల రాచెల్ , 52 ఏళ్ల హెలెన్ ప్యాచింగ్ అనే ఇద్దరు స్త్రీలు కొన్ని రోజుల క్రితం వివాహం చేసుకున్నారు. కొత్త సంవత్సరంలో తమతో పాటు తమ కుటుంబం సంతోషంగా ఎంజాయ్ చేయాలని.. భావించారు. న్యూ ఇయర్ కి స్వాగతం చెప్పడానికి పార్టీకి వెళ్లారు. అక్కడ ఇద్దరూ ట్రెక్కింగ్ చేస్తూ.. కాలు జారి నీటిలో పడిపోయినట్లు తెలుస్తోంది. జనవరి 4న ఈ ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. అసలు వీరిద్దరు నీటిలో ఎలా పడిపోయూరు..? ప్రమాదం వెనుక గల కారణాలేంటి? అనే అంశాలను కనిపెట్టే పనిలో ఉన్నారు పోలీసులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎమ్మెల్యే గారూ.. నాకొక అమ్మాయి కావాలి.. యువకుడు లేఖ..
ఇది మహా ఉంగరం !! ఇందులో ఎన్ని వజ్రాలున్నాయో తెలుసా ??
క్యారమ్స్‌లో రఫ్ఫాడించిన 83 ఏళ్ల బామ్మ !! మాకు ప్రేరణ అంటున్న నెటిజన్లు
దీని పనే బాగుంది.. రూ.800 కోట్లు సంపాదించిన పిల్లి !!
వైరల్ అవుతున్న .. ఓలా రెస్ట్ రూమ్స్ వీడియోలో నిజమెంత ??