Amazing Train Journy: ఈ రూట్ లో రైలు ప్రయాణం.. అద్భుతం.. మనసు దోచేస్తున్న దృశ్యాలు..

భారతీయ రైల్వేలు ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటి. రైలు ప్రయాణం కొందరికి అంతులేని అనుభూతిని మిగుల్చుతుంది. కొండాకోనలు, నదులు, జలపాతాల మధ్య రైలు ప్రయాణించేటప్పుడు ఆ ప్రకృతి రమణీయ

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Aug 11, 2022 | 10:10 AM


భారతీయ రైల్వేలు ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటి. రైలు ప్రయాణం కొందరికి అంతులేని అనుభూతిని మిగుల్చుతుంది. కొండాకోనలు, నదులు, జలపాతాల మధ్య రైలు ప్రయాణించేటప్పుడు ఆ ప్రకృతి రమణీయ దృశ్యాలను చూసేందుకు రెండు కళ్లూ చాలవు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ లో పంచుకుంది. రాజస్థాన్‌లోని దారా ఘాట్‌ల గుండా ప్రయాణిస్తున్న ఓ రైలు వీడియో నెటిజన్ల మనసు దోచుకుంటోంది. 41 సెకన్ల క్లిప్ కొండ కోనలను దాటుకుంటూ దూసుకెళ్తోన్న ఈ రైలు ప్రకృతి అందాలను పరిచయం చేస్తోంది. ఈ వీడియోను వేలమంది వీక్షిస్తూ ముగ్దులైపోతున్నారు. వందలమంది లైక్‌ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. అంతే కాకుండా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. రైల్వేకు అభినందనలు, ఇండియన్ రైల్వేస్ ప్రకృతి అందాలతో మంత్రముగ్ధులను చేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu