Conistable: నువ్వు దేవుడవు సామి..! ఎండలో నిలబడిన చిన్నారికి .. తన కాళ్ళనే చెప్పులుగా చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్..

ఇండోర్ ట్రాఫిక్ పోలీసు రంజిత్ మరోసారి తన మంచిమనసును చాటుకున్నారు. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఎండలో నిలబడిన ఓ చిన్నారికి తన కాళ్లనే చెప్పులుగా చేసి రక్షణ కల్పించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.

Anil kumar poka

|

May 26, 2022 | 1:43 PM


ఇండోర్ ట్రాఫిక్ పోలీసు రంజిత్ మరోసారి తన మంచిమనసును చాటుకున్నారు. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఎండలో నిలబడిన ఓ చిన్నారికి తన కాళ్లనే చెప్పులుగా చేసి రక్షణ కల్పించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ ఫోటో నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. రంజిత్‌ ఉదారతను అందరూ మెచ్చుకుంటున్నారు. ఇదే విషయంపై రంజిత్‌తో మాట్లాడగా.. ఇద్దరు పిల్లలు ఎండలో తిరుగుతున్నారని, ఒక పిల్లాడు చెప్పులు వేసుకుని ఉన్నాడని, మరో చిన్నారికి చెప్పులు లేవని చెప్పారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు ఆ బాలురు చేరుకునే సరికి సిగ్నల్ ఆన్ అయిందని, దాంతో పిల్లలు అక్కడే నిలబడిపోయారని చెప్పారు. అయితే వారిలో ఓ పిల్లాడికి చెప్పులు లేవు… దాంతో అతని కాళ్లు కాలుతుండటంతో ఆ బాలుడు చాలా బాధను అనుభవిస్తున్నాడు.. అందుకే తన బూట్లపై చిన్నారిని నిలబెట్టానని చెప్పారు. రెడ్ సిగ్నల్ పడి రోడ్డుమీద ట్రాఫిక్ ఆగిన అనంతరం.. బాలుడిని రోడ్డు దాటించారు.అదే సమయంలో రంజిత్ ఆ ఇద్దరు బాలుర గురించి ఆరాతీసారు. వారి ఆర్థిక సమస్యల గురించి అడిగి తెలుసుకున్నాడు. కుటుంబ పోషణ కోసం పిల్లలు పడుతున్న బాధను చూసి రంజిత్ ఉద్వేగానికి లోనయ్యారు. వెంటనే రంజిత్ పక్కనే ఉన్న షాపులో ఆ చిన్నారి బాలుడికి చెప్పులు కొనిచ్చారు. అనంతరం ఆ ఇద్దరు పిల్లలను సురక్షితంగా అక్కడ నుంచి పంపించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రానున్న రోజుల్లో కూడా ఇలాగే ప్రజలకు సహాయం చేస్తానని రంజిత్ చెబుతుండగా.. ఇద్దరు పిల్లలకు సహాయం చేసిన సీనియర్ అధికారులు కూడా రంజిత్‌ను ప్రశంసించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?

Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu