Poison Garden: ఈ గార్డెన్‌లో గాలి పీలిస్తే పైకే..! ఇదేం వింత రా..! విషపు మొక్కలతో నిండిన ఉద్యానవనం..

సాధారణంగా పార్కుల్లో ‘పూలను తెంచొద్దు’ అని రాసి ఉండటాన్ని చూసే ఉంటారు. కానీ ఈ ‘పాయిజన్‌ గార్డెన్‌’ దగ్గర మాత్రం ‘ఇక్కడ ఆగొద్దు, పూల వాసన చూడొద్దు’ అని రాసి ఉంటుంది!

Poison Garden: ఈ గార్డెన్‌లో గాలి పీలిస్తే పైకే..! ఇదేం వింత రా..! విషపు మొక్కలతో నిండిన ఉద్యానవనం..

|

Updated on: Jul 24, 2022 | 9:09 AM


సాధారణంగా పార్కుల్లో ‘పూలను తెంచొద్దు’ అని రాసి ఉండటాన్ని చూసే ఉంటారు. కానీ ఈ ‘పాయిజన్‌ గార్డెన్‌’ దగ్గర మాత్రం ‘ఇక్కడ ఆగొద్దు, పూల వాసన చూడొద్దు’ అని రాసి ఉంటుంది! ఎందుకంటే ఇందులోని విషపూరిత మొక్కలు విడుదల చేసే విషవాయువులను పీలిస్తే సొమ్మసిల్లి పడిపోవడం లేదా మరణించడం ఖాయమట! అయితే క్యూరియాసిటీ కొద్దీ ఇంగ్లండ్‌లో ఉన్న ఈ గార్డెన్‌కు పర్యాటకులు బొటానిస్ట్‌లు తరలివస్తుంటారు. అందుకే ‘ద పాయిజన్‌ గార్డెన్‌’ వద్ద ఉన్న భారీ గేటుపై పుర్రె, ఎముక గుర్తును ఉంచి మరీ ఈ విషయాన్ని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఎవరైనా ఇందులోకి ప్రవేశించాలంటే కచ్చితంగా గైడ్‌ సాయం తీసుకోవాలని చెబుతున్నారు. అయినా కొందరు ఆకతాయితనంతో ఆ మొక్కల ఆకులు, పూల వాసన పీల్చి స్పృహ తప్పుతుంటారని పేర్కొన్నారు. నిర్వాహకుల లెక్కల ప్రకారం ఈ గార్డెన్‌ను ఏటా 6 లక్షల మంది సందర్శిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది వృక్ష శాస్త్రవేత్తలే. ‘వరల్డ్స్‌ డెడ్లీయెస్ట్‌ గార్డెన్‌’ అంటూ ట్విట్టర్‌లో తాజాగా ఓ వ్యక్తి ఈ గార్డెన్‌ గేటు ఫొటో షేర్‌ చేయడంతో వైరల్‌ అవుతోంది.ఈశాన్య ఇంగ్లాండ్‌లోని నార్త్‌అంబర్‌ల్యాండ్‌ కౌంటీ రాజ్యవంశ పాలనాధికారి సతీమణి అయిన జేన్‌ పెర్సీ కొన్నేళ్ల కిందట తమ కోట ఆవరణలోని 14 ఎకరాల తోట సుందరీకరణకు నడుంబిగించింది. గార్డెన్‌కు ప్రత్యేక ఆకర్షణ తెచ్చేందుకు సాధారణ పూల మొక్కలతోపాటు 100 రకాల విషపూరిత మొక్కలను వివిధ దేశాల నుంచి తెప్పించింది. ఇందులో మాంక్స్‌హుడ్, రోడోడెడ్రాన్స్, వోల్ఫ్స్‌ బేన్‌ వంటి విషపూరిత జాతుల మొక్కలు ఉన్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యంత విషపూరితమైన మొక్కగా గిన్నిస్‌ బుక్‌ గుర్తించిన రిసిన్‌ కూడా ఈ గార్డెన్‌లో ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Follow us