Theft with rubber band: ఖతర్నాక్ దొంగ.. రబ్బర్ బ్యాండ్‌తో కార్లలో చోరీ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

చోరీలు చెయ్యడంలో ఈ దొంగ స్టయిలే వేరు. తాజాగా ఓ దొంగ పోలీసులకు చిక్కాడు. అతడికి ఒక్క రబ్బరు బ్యాండ్‌ ఉంటే చాలు.. అదే అతడి ఆయుధం. ఊర్లలో పిట్టలను కొట్టే వారి తరహాలో ఇతను హెయిర్ పిన్‌కి రబ్బర్ బ్యాండ్‌ కట్టి, దానికి ఓ చాక్లెట్ కవరును కడుతున్నాడు.

Theft with rubber band: ఖతర్నాక్ దొంగ.. రబ్బర్ బ్యాండ్‌తో కార్లలో చోరీ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

|

Updated on: Jan 26, 2022 | 8:39 AM

చోరీలు చెయ్యడంలో ఈ దొంగ స్టయిలే వేరు. తాజాగా ఓ దొంగ పోలీసులకు చిక్కాడు. అతడికి ఒక్క రబ్బరు బ్యాండ్‌ ఉంటే చాలు.. అదే అతడి ఆయుధం. ఊర్లలో పిట్టలను కొట్టే వారి తరహాలో ఇతను హెయిర్ పిన్‌కి రబ్బర్ బ్యాండ్‌ కట్టి, దానికి ఓ చాక్లెట్ కవరును కడుతున్నాడు. ఆ కవరు మధ్యలో చిన్న రాయిని పెడుతున్నాడు. రాయిని లాగి… కారు అద్దంవైపు గురిపెడుతున్నాడు. వేగంగా దూసుకెళ్లే రాయి… కారు అద్దాన్ని పగలగొడుతోంది. వెంటనే తన పనికానిచ్చేస్తున్నాడు. అంత ఈజీగా ఇతను చోరీలు చేస్తున్నాడు. ఇలా చేసినప్పుడు అద్దం పగిలిన శబ్దం పెద్దగా రాకపోవడంతో ఎవరికీ ఆ విషయం తెలియదు. అందుకే ఈ టెక్నిక్ ఫాలో అవుతున్నాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన ఈ దొంగను దర్యాప్తు చేసిన పోలీసులు అతను చోరీలకు పాల్పడుతున్న విధానం గురించి విని నమ్మలేదు. అయితే అతను పోలీసులు ఎదురుగానే రబ్బర్ బ్యాండ్‌తో కార్ల అద్దాలు పగలగొట్టి చూపించాడు.

ఇందుకు సంబంధించిన వీడియోని IPS ఆఫీసర్ రుపిన్ శర్మ… తన ట్విట్టర్ అకౌంట్లో జనవరి 6న పోస్ట్ చేశారు. “పార్క్ చేసిన కార్లలో విలువైన వస్తువులు ఉంచకండి. వాళ్లు రబ్బర్ బ్యాండ్‌తో గ్లాస్ పగలగొట్టగలరు. తమిళనాడులో ఇది జరిగింది” అని వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ప్రజలను అప్రమత్తం చెయ్యడానికే పోలీసులు ఈ విషయాన్ని మీడియా మందుంచారు. సో… కార్ పార్క్ చేసి.. లాక్ వేసినంత మాత్రాన అది సేఫ్‌గా ఉంటుందనీ, అందులోని వస్తువులు సురక్షితంగా ఉంటాయని గ్యారంటీ లేదు. అందుకే ఎంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది. ప్రస్తుతం ఈ ఖతర్నాక్ దొంగ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

Follow us
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..