Movie Tickets: లుంగీ వేసుకొచ్చారని టికెట్స్‌ ఇవ్వని థియేటర్‌.. కట్ చేస్తే క్షమాపణలు చెప్పిన థియేటర్‌ యాజమాన్యం..

బంగ్లాదేశ్‌లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. లుంగీ వేసుకొని వచ్చాడని ఓ వ్యక్తికి మల్టీప్లెక్స్‌ థియేటర్‌లో టికెట్‌ ఇచ్చేందుకు నిరాకరించారు. దాంతో విషయం తెలిసిన పలువురు ప్రేక్షకులు లుంగీలు కట్టుకుని థియేటర్‌‌కు వచ్చి నిరసన తెలిపారు.

Movie Tickets: లుంగీ వేసుకొచ్చారని టికెట్స్‌ ఇవ్వని థియేటర్‌.. కట్ చేస్తే క్షమాపణలు చెప్పిన థియేటర్‌ యాజమాన్యం..

|

Updated on: Aug 16, 2022 | 5:50 PM


బంగ్లాదేశ్‌లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. లుంగీ వేసుకొని వచ్చాడని ఓ వ్యక్తికి మల్టీప్లెక్స్‌ థియేటర్‌లో టికెట్‌ ఇచ్చేందుకు నిరాకరించారు. దాంతో విషయం తెలిసిన పలువురు ప్రేక్షకులు లుంగీలు కట్టుకుని థియేటర్‌‌కు వచ్చి నిరసన తెలిపారు. దెబ్బకు దిగొచ్చిన యాజమాన్యం.. క్షమాపణలు తెలిపింది. బంగ్లాదేశ్‌లో ఢాకాకు చెందిన సమాన్‌ అలీ సర్కార్‌ అనే వృద్ధుడు మల్టీప్లెక్స్‌ థియేటర్‌కి లుంగీతో వచ్చాడు. అతను బంగ్లదేశ్‌ రాజధాని సోనీ స్క్వేర్‌ బ్రాంచ్‌లో ఉన్న మల్టీపెక్స్‌ థియేటర్‌లో ‘పురాణ్‌’ అనే ప్రముఖ సినిమాను చూసేందుక వచ్చాడు. ఐతే థియేటర్‌ వాళ్లు అతని వేషధారణ చూసి సినిమా టికెట్‌ ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ విషయం కాస్త ఇంటర్నెట్‌లో పెద్ద దూమారం రేపింది. థియేటర్‌ యాజమాన్యం తీరుపై నెటజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సదరు మల్టీప్లెక్స్‌ థియేటర్‌ వెంటనే అప్రమత్తమై దీంతో దిగొచ్చిన స్టార్ సినీప్లెక్స్ ఈ ఘటనపై వివరణ ఇచ్చింది. సదరు వ్యక్తి సమాన్‌ అలీని, అతని కుటుంబాన్ని సినిమా చూసేందుకు థియోటర్‌కి ఆహ్వానించడమే కాకుండా వారితో తీసుకున్న ఫోటోలను కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ప్రతి ఒక్కరూ మల్టీప్లెక్స్‌ థియేటర్‌కి వచ్చి సినిమా చూడొచ్చు అని, థియేటర్‌కి ఇలానే రావాలనే పాలసీ ఏమీ లేదని చెప్పుకొచ్చింది. ఎవరి అభిరుచికి తగ్గట్టుగా వారు రెడీ అయ్యి రావచ్చు అని సదరు థియేటర్‌ యజమాన్యం వివరణ ఇచ్చుకుంది. అంతేకాదు, ‘పురాణ్‌’ సినిమా నటుల్లో ఒకరైన సరిల్‌పురి రాజ్ కూడా వారితో కలిసి సినిమా చూడడం కొసమెరుపు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Follow us