రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఆసక్తికర సన్నివేశం సీఎం కాన్వాయ్ వెంట పరుగులు తీసిన మహిళ.. (వీడియో)

రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఆదివారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఏపీ సీఎం జగన్ రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతికి వస్తుండగా కాన్వాయ్ కు ఒక మహిళ అడ్డుపడింది. ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు సీఎం కారుకు అడ్డుగా వెళ్లింది.

రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఆసక్తికర సన్నివేశం సీఎం కాన్వాయ్ వెంట పరుగులు తీసిన మహిళ.. (వీడియో)

|

Updated on: Nov 22, 2021 | 9:24 AM


రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఆదివారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఏపీ సీఎం జగన్ రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతికి వస్తుండగా కాన్వాయ్ కు ఒక మహిళ అడ్డుపడింది. ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు సీఎం కారుకు అడ్డుగా వెళ్లింది. “సీఎం గారూ ప్లీజ్ హెల్ప్” అంటూ ప్లకార్డులు పట్టుకుని ఆ మహిళ సీఎం జగన్ కాన్వాయ్ కు అడ్డువచ్చింది. వెంటనే పోలీసులు ఆమెను పక్కకు తప్పించారు. బాధితురాలు కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన మహిళగా గుర్తించారు.

దీంతో మహిళను గమనించిన ముఖ్యమంత్రి.. కారు కొంత దూరం వెళ్లాక కాన్వాయ్‌ని ఆపాలని చెప్పి.. మహిళ వద్దకు ఓఎస్‌డీని పంపించి సమస్య ఏంటో తెలుసుకోవాలని ఆదేశించారు. ఓఎస్‌డీ ధనుంజయరెడ్డి వెళ్లి బాధితురాలి దగ్గర నుంచి ఫిర్యాదు స్వీకరించారు. అయితే.. సీఎం కాన్వాయ్‌కి మహిళ అడ్డుపడటం.. అది గమనించిన జగన్ కాన్వాయ్‌ని ఆపించి మహిళ సమస్యను తెలుసుకోవాలని చెప్పి ఓఎస్‌డీ పంపించడం ఆసక్తికరంగా మారింది.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Follow us