Storm Video: భీకర ప్రళయంగా మారిన తుఫాన్‌.. హెలికాప్టర్ రెస్క్యూ వైరల్ అవుతున్న వీడియో..

దక్షిణ చైనా సముద్రంలో "చాబా' తుపాన్‌ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తుపాన్‌ భీకర ప్రళయంగా మారి విరుచుకుపడటంతో ఊహించని విపత్తుకు ఓ ఇంజినీరింగ్ ఓడ రెండుగా చీలిపోయి నీట మునిగింది.

Anil kumar poka

|

Jul 06, 2022 | 11:53 AM


దక్షిణ చైనా సముద్రంలో “చాబా’ తుపాన్‌ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తుపాన్‌ భీకర ప్రళయంగా మారి విరుచుకుపడటంతో ఊహించని విపత్తుకు ఓ ఇంజినీరింగ్ ఓడ రెండుగా చీలిపోయి నీట మునిగింది. దీంతో ఓడలో ఉన్న 30 మంది సిబ్బంది గల్లంతయ్యారు. ఆ తర్వాత12 మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. కాగా.. హాంగ్‌కాంగ్‌ ప్రభుత్వం సహాయకచర్యల్లో భాగంగా నలుగురిని రక్షించింది. భీకర గాలులు కుండపోతగా కురుస్తున్న వర్షం మధ్య సముద్రంలో ఆపరేషన్‌ చేపట్టింది. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. భద్రతాదళాల సాహసంతో సగం నీట మునిగిన ఓడలో నుంచి ఒక వ్యక్తిని హెలికాప్టర్‌లోకి చేర్చారు. భారీ ఓడ సగం నీట మునిగిన దృశ్యం చూపరులను షాక్‌కు గురి చేస్తుంది. కాగా తాజాగా తుపాన్‌ గ్వాండాంగ్‌ ప్రావిన్స్‌ వద్ద తీరం దాటింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Friendship video: నలుగురు ఫ్రెండ్స్‌.. ఒకటే గొడుగు.. స్కూల్ ఏమో దూరం..! ఇది కదా ఫ్రెండ్ షిప్ అంటే..

Pocket Money 40 lakhs: ఆమె ఒక్కరోజు పాకెట్‌ మనీ రూ. 40లక్షలు.. చుస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

Mosquitoes: దోమలు కొందరినే కుట్టడానికి కారణం.. ? శరీర వాసనలలో మార్పులా..?

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu