Son beaten father: వీడు కొడుకు కాదు.. రాక్షసుడు.. కన్న తండ్రిని నడిరోడ్డుపై అతిదారుణంగా.. వామ్మో.

తండ్రి తన బిడ్డలను ఎంతో ప్రేమగా పెంచుతాడు. చిట్టి పాదాలతో ఆ పసివాళ్లు గుండెలపై తన్నుతుంటే ఆ పాదాలను ముద్దాడతాడు. అలా కొడుకును అల్లారు ముద్దుగా పెంచి.. పెద్ద చేసిన

Son beaten father: వీడు కొడుకు కాదు.. రాక్షసుడు.. కన్న తండ్రిని నడిరోడ్డుపై అతిదారుణంగా.. వామ్మో.

|

Updated on: Oct 05, 2022 | 9:58 AM


తండ్రి తన బిడ్డలను ఎంతో ప్రేమగా పెంచుతాడు. చిట్టి పాదాలతో ఆ పసివాళ్లు గుండెలపై తన్నుతుంటే ఆ పాదాలను ముద్దాడతాడు. అలా కొడుకును అల్లారు ముద్దుగా పెంచి.. పెద్ద చేసిన తండ్రి పాలిట రాక్షసుడుగా మారాడు ఓ కొడుకు. కనీసం వృద్ధుడన్న కనికరం లేకుండా విచక్షణారహితంగా కొట్టాడు. స్థానికులు అడ్డుపడుతున్నా పట్టించుకోకుండా దారుణంగా కొట్టాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లో వెలుగుచూసింది. కొందరు ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. జోధ్‌పూర్‌ నగరానికి చెందిన తండ్రీ కొడుకు మధ్య వివాదం నెలకొంది. ఈ వివాదం కాస్త ముదరడంతో కొడుకు కన్న తండ్రిపై చేయిచేసుకున్నాడు. జన్మనిచ్చిన తండ్రి దారుణంగా విలపిస్తున్నా వదలకుండా కర్రతో చావబాదాడు. స్థానికులు వారించినా వినకుండా వీధంతా తిప్పుతూ దాడి చేశాడు. ఈ షాకింగ్ ఘటన జరిగిన జోధ్‌పూర్‌లోని రతనాడ పోలీస్ స్టేషన్ స్టేషన్ పరిధిలో జరిగింది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. తండ్రిని హింసించిన కొడుకును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తండ్రిపై దాడి చేయడం ఇదే మొదటిసారి కాదని తెలిపారు.ఈ ఘటనకు ఒకరోజు ముందు కుమారుడు తన తండ్రితో అనుచితంగా ప్రవర్తించాడని పోలీసులు చెబుతున్నారు. నిందితుడిపై సెక్షన్‌ 151 కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు నిందితుడిపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Follow us
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఏఐ ఫీచర్..
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఏఐ ఫీచర్..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..