Security guard: సాటివారికి సాయం చేస్తే ఇంత ప్రమాదమా.. సాయం చేసినందుకు చెంపదెబ్బలు..(వీడియో)

సాధారణంగా మనం ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైనా మనకు సాయం చేస్తే.. వారికి కృతజ్ఞతలు చెప్తాం. కాని కొంతమంది మాత్రం సాయానికి కృతజ్ఞతలు కాదు కదా.. సాయం చేసినవారిపై రివర్స్‌ ఎటాక్‌ చేస్తుంటారు.

Security guard: సాటివారికి సాయం చేస్తే ఇంత ప్రమాదమా.. సాయం చేసినందుకు చెంపదెబ్బలు..(వీడియో)

|

Updated on: Sep 03, 2022 | 9:06 PM


సాధారణంగా మనం ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైనా మనకు సాయం చేస్తే.. వారికి కృతజ్ఞతలు చెప్తాం. కాని కొంతమంది మాత్రం సాయానికి కృతజ్ఞతలు కాదు కదా.. సాయం చేసినవారిపై రివర్స్‌ ఎటాక్‌ చేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇటీవల నొయిడాలో గేటేడ్ కమ్యూనిటీలో ఓ మహిళ సెక్యూరిటీ గార్డును కొట్టిన ఉదంతం జరిగి 10 రోజులు గడవకముందే ఇలాంటి ఘటనే మరొకటి గురుగ్రామ్ లో జరిగింది. గురుగ్రామ్ లోని ద క్లోజ్ నార్త్ సొసైటీలో నివాసం ఉంటున్న వరుణ్ నాథ్ 14వ అంతస్తు నుంచి లిఫ్ట్ లో కిందకి వస్తున్నాడు. ఈసమయంలో లిఫ్ట్ ఆగిపోయింది. సహాయం కోసం లిఫ్ట్‌లో ఉన్న ఇంటర్‌కామ్ ద్వారా సెక్యూరిటీ గార్డుకు సమాచారం ఇచ్చాడు. అశోక్ తనతోపాటు లిఫ్ట్‌మ్యాన్‌తో సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. లిఫ్ట్ లో ఉన్న వరుణ్‌ని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ఐదు నిమిషాల సమయం పట్టింది. దీంతో కోపోద్రిక్తుడైన వరుణ్ నాథ్ లిఫ్ట్ నుంచి బయటకు రాగానే సెక్యూరిటీ గార్డును, లిఫ్ట్ మ్యాన్ ను చెంపదెబ్బలు కొట్టాడు. దీంతో ఆగ్రహించిన దక్లోజ్ నార్త్ సొసైటీలోని సెక్యూరిటీ గార్డులంతా సమ్మెకు దిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తతంగమంతా సొసైటీలోని లిఫ్ట్ దగ్గర అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. లిఫ్ట్ లో ఇరుక్కుపోయారన్న విషయం తెలుసుకున్న సెక్యూరిటీగార్డు లిఫ్ట్ మ్యాన్ కు సమాచారం ఇచ్చి వరుణ్ నాథ్ ని బయటకు తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పడం మాని చెంపదెబ్బలు కొట్టడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగంలోకి దిగిన గురుగ్రామ్ పోలీసులు నిందితుడు వరుణ్ నాథ్‌పై ఐపీసీ సెక్షన్ 323 , 506 కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Pawan Kalyan: వన్‌ అండ్‌ ఓన్లీ పవర్ స్టార్‌.. ఇది పేరు కాదు ప్రభంజనం.. ఎనలేని పాపులారిటీ..(వీడియో).

Sr.NTR Rare Video: NTRతో అట్లుంటది మరి.. ముహుర్తం టైంకు పెళ్లి అవడంలేదని ఏకంగా..(వీడియో)

Follow us