Google Doodle: గూగుల్‌ డూడుల్‌ పోటీ విజేత శ్లోక్‌..! కల్పనాశక్తికి న్యాయనిర్ణేతలు ఫిదా.. వీడియో.

గూగుల్‌ 2022 డూడుల్‌ పోటీల ఫలితాలను ప్రకటించింది. కోల్‌కతాకు చెందిన శ్లోక్‌ ముఖర్జీగా విజేతగా నిలిచాడు. ఇండియా ఆన్‌ ది సెంటర్‌ స్టేజ్‌ అనే డూడుల్‌ను రూపొందించాడు శ్లోక్‌. ఆ డూడుల్‌ Google.co.inలో ప్రదర్శితమవుతోంది.

Google Doodle: గూగుల్‌ డూడుల్‌ పోటీ విజేత శ్లోక్‌..! కల్పనాశక్తికి న్యాయనిర్ణేతలు ఫిదా.. వీడియో.

|

Updated on: Nov 17, 2022 | 9:22 AM


శ్లోక్‌ డూడుల్‌ ఈ రోజు చిల్డ్రన్స్‌ డే సందర్భంగా గూగుల్‌ హోం పేజ్‌లో దర్శనమిస్తోంది. ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుతున్నాడు శ్లోక్‌. ‘‘రాబోయే పాతికేళ్లలో.. మానవాళి అభివృద్ధికి నా దేశ శాస్త్రవేత్తలు తమ సొంత పర్యావరణ అనుకూల రోబోట్‌ను అభివృద్ధి చేస్తారు. భారతదేశం భూమి నుంచి అంతరిక్షానికి క్రమం తప్పకుండా ఇంటర్ గెలాక్టిక్ ప్రయాణాలను చేస్తుంది. యోగా, ఆయుర్వేదంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. రాబోయే రోజుల్లో దేశం మరింత బలపడుతుంది’’ అంటూ తన డూడుల్‌ సందేశంలో పేర్కొన్నాడు. విద్యార్థుల సృజనాత్మకత కల్పనాశక్తిని చూసి గూగుల్‌ న్యాయనిర్ణేతలే ఆశ్చర్యపోయారట. దేశవ్యాప్తంగా మొత్తం వంద నగరాల నుంచి ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థుల నుంచి లక్షా 15వేల ఎంట్రీలు వచ్చాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Tattoo for Govt Job: పచ్చబొట్టు ఉంటే కేంద్ర సర్వీసుల్లో ఉద్యోగం కట్..! ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన యువకుడు..

Woman – daughter: అమానుషం.. తన ప్రియుడితో కుమార్తెకు పెళ్లి చేయించిన తల్లి..! బిడ్డను కాపాడుకోవాల్సిన త‌ల్లే ఇలా..

Hognose snake: పాముల ప్రపంచానికి డ్రామా రాణి.. ఈ పాము వేషాలు మామూలుగా లేవుగా.. చ‌నిపోయిన‌ట్లు న‌టించి..

Follow us