Squirrel – Snake: సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్న పాము-ఉడత ఫైట్.. పారిపోతున్న పాముపై దాడి చేసిన ఉడత..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు తెగ ముచ్చటేస్తుంటాయి.. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని దడపుట్టిస్తుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలైతే భిన్నంగా ఉంటాయి.

Squirrel – Snake: సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్న పాము-ఉడత ఫైట్.. పారిపోతున్న పాముపై దాడి చేసిన ఉడత..

|

Updated on: Aug 16, 2022 | 5:48 PM


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు తెగ ముచ్చటేస్తుంటాయి.. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని దడపుట్టిస్తుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలైతే భిన్నంగా ఉంటాయి. ఆహారం కోసం.. పెద్ద జంతువులు.. చిన్న జంతువులను వేటాడుతుంటాయి. ఈ ప్రక్రియలో ఎప్పుడు ఎవరు గెలుస్తారో చెప్పడం చాలా కష్టం. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఉడుత.. పామును అతి కిరాతకంగా వేటాడి చంపింది. ఈ వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.సాధారణంగా పామును చూడగానే భయంతో వణికిపోతుంటాం.. చిన్న చిన్న జంతువులు వాటిని జాడ కనిపిస్తే ఆమడ దూరం వెళ్తుంటాయి. కానీ.. అలాంటి పాముకు ఓ ఉడుత ముచ్చెమటలు పట్టించింది. పాము, ఉడుత రెండూ హోరాహోరిగా పొట్లాటకు దిగాయి. ఉడుత ఏమాత్రం తగ్గేదేలే అంటూ పామును ముప్పుతిప్పలు పెట్టి మరి ఓడించింది. పారిపోతున్న పామును వెంటాడి దాడి చేసి తన పళ్లతో కొరుకుతుంది ఉడత. ఇందుకు సంబంధించిన వీడియో అవుతుండటంతో నెటిజన్లు కామెంట్లు కురిపించారు. పాముకే.. ఉడుత ముప్పుతిప్పలు పెట్టిందంటే.. ఇది మామూలిది కాదంటూ పేర్కొంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Follow us