Viral Video: గ్రౌండ్‌‌లో టెడ్డీ బేర్ల వర్షం.! చుస్తే వావ్ అనాల్సిందే.. వైరల్ అవుతున్న వీడియో..

ఐస్‌ హాకీ గేమ్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ ప్లేయర్‌ దూసుకొచ్చి గోల్‌ కొట్టిన వెంబడే.. స్టాండ్స్‌లో ఉన్న ఫ్యాన్స్‌ అంతా ఒక్కసారిగా టెడ్డీ బేర్లను గ్రౌండ్‌లోకి విసిరేశారు. దీంతో గ్రౌండ్‌ మొత్తం టెడ్డీ బేర్లతో నిండిపోయింది. టెడ్డీబేర్ల వర్షం కురిసిందా అనేలా..

Viral Video: గ్రౌండ్‌‌లో టెడ్డీ బేర్ల వర్షం.! చుస్తే వావ్ అనాల్సిందే.. వైరల్ అవుతున్న వీడియో..

|

Updated on: Feb 08, 2022 | 9:21 AM


ఐస్‌ హాకీ గేమ్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ ప్లేయర్‌ దూసుకొచ్చి గోల్‌ కొట్టిన వెంబడే.. స్టాండ్స్‌లో ఉన్న ఫ్యాన్స్‌ అంతా ఒక్కసారిగా టెడ్డీ బేర్లను గ్రౌండ్‌లోకి విసిరేశారు. దీంతో గ్రౌండ్‌ మొత్తం టెడ్డీ బేర్లతో నిండిపోయింది. టెడ్డీబేర్ల వర్షం కురిసిందా అనేలా.. వేల సంఖ్యలో బొమ్మలు మైదానంలో కనువిందు చేశాయి. అంతేకాదు.. అత్యధిక టెడ్డీలు విసిరి రికార్డు కూడా సృష్టించారు. ఈ ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలోని హర్ష్‌లీలో ఉన్న గెయింట్‌ సెంటర్‌లో చోటుచేసుకుంది. మైదానంలో ఇరు జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతుండగా.. ప్రేక్షకుల దృష్టంతా అప్పటివరకు ఆ ఆటమీదే ఉంది. చివర్లో ఓ ప్లేయర్ దూసుకొచ్చి గోల్ కొట్టేశాడు. అంతే.. ప్రేక్షకుల కేరింతలు మొదలయ్యాయి. తమ వెంట తెచ్చుకున్న టెడ్డీ బేర్లను మైదానంలోకి విసురుతూ సంబురాలు చేసుకున్నారు.

Follow us